ఇంట్రెస్టింగ్ అప్ కమింగ్ మూవీస్

Wednesday,June 12,2019 - 10:03 by Z_CLU

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలే. కానీ రెగ్యులర్ సినిమాలు మాత్రం డెఫ్ఫినెట్ కాదు… 4 ఫైట్లు … 6 పాటలు ఫార్మాట్ తో కాకుండా థ్రిల్లింగ్ స్టోరీలైన్స్ తో.. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కుతున్నాయి ఈ సినిమాలు. 

 

బ్రోచేవారెవరురా : R3 అనే ఒక చిన్న గ్యాంగ్…  రాకీ, రాంబో, రాహుల్… ఎంత కష్టంగా ట్రై చేసినా ఇంటర్ కూడా దాటరు… దానికి తోడు మిత్ర.. ప్రిన్సిపాల్ కూతురు… వీళ్ళకి డబ్బు అవసరం.. ఆ డబ్బుకోసం ఏం చేస్తారు..? ఈ ప్రాసెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేదే ఈ సినిమా కథ.. ఇకపోతే నివేత పేతురాజ్… సత్యదేవ్ కథలో ఇకడ ఉంటారన్నది.. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్…

కల్కి : హై ఆక్టేన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. దర్శకుడు ప్రశాంత్ వర్మ జస్ట్ కథనపైనే కాదు.. విజువల్స్ విషయంలో  కూడా పనితనం చూపించాడు. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ‘కల్కి’ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో క్యూరియాసిటీ రేజ్ చేస్తుంది. మర్డర్ మిస్టరీ ఎంటర్ టైనర్స్ టాలీవుడ్ లో కొత్త కాదు కానీ, ఈ సినిమాలో సమ్ థింగ్ డిఫెరెంట్ ఉండబోతుందనే వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

 

ఓ బేబీ : ఇలాంటి కథ డెఫ్ఫినెట్ గా తెలుగు సినిమాలో ఇప్పటి వరకు రాలేదు. సడెన్ గా ఒక ముసలావిడ యంగ్ అమ్మాయిగా మారిపోవడం… వినడానికే చాలా కొత్తగా ఉంది. దానికి తోడు ఈ క్యారెక్టర్ కి ఫాదర్ దగ్గరి నుండి యంగ్ బాయ్ ఫ్రెండ్ ని కూడా అటాచ్ చేయడంతో సినిమాలో బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ఉందనిపిస్తుంది. చూడాలి మరీ… నందిని రెడ్డి ఈ సినిమాని ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసిందో…

డిస్కోరాజా : మాస్ మహారాజ్ రవితేజ కరియర్ లోనే డిఫెరెంట్ సినిమా. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ ప్రయోగం వికటించి ఓల్డ్ మ్యాన్ .. యంగ్ రవితేజగా మారిపోతాడట.. ఇంకేముంది అక్కడి నుండే ఎంటర్టైన్ మెంట్ షురూ..  రెగ్యులర్ కంటెంట్ ఇస్తేనే మాస్ మహారాజ్ ఇరగదీస్తాడు.. అలాంటిది ఇంత యూనిక్ క్యారెక్టరైజేషన్ ఇస్తే అదరగొట్టేయడం గ్యారంటీ..