నాని ఆ సినిమాను వదులుకోవడానికి రీజన్ అదే

Wednesday,October 31,2018 - 11:02 by Z_CLU

కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సాయి ధరం తేజ్ ‘చిత్రలహరి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఇటివలే ప్రారంభమైన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.  సాయి ధరం తేజ్ కంటే ముందు ఈ సినిమా నానితో ఉంటుందనే వార్తలు ఆ మధ్య చక్కర్లు కొట్టాయి.. ఈ విషయంపై లేటెస్ట్ గా స్పందించారు మైత్రి నిర్మాతలు.

‘సవ్యసాచి’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాతలు నవీన్, రవి, మోహన్ నానితో సినిమాపై క్లారిటీ ఇచ్చారు ” ఆ సినిమాను ముందుగా నానితో నిర్మించాలనుకున్న మాట వాస్తవమే. కానీ గతంలో నాని అలాంటి లవ్ స్టోరీస్ చేశానని ఫీలవ్వడంతో ఆ సినిమా నానితో చేయడం కుదరలేదు.. కానీ నానితో మా బ్యానర్ లో త్వరలోనే సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. సో అన్నీ కుదిరితే ‘జెర్సీ’ తర్వాత నాని మైత్రి మూవీ మేకర్స్ లో సినిమా చేసే ఛాన్స్ ఉంది.