కల్కి ట్రయిలర్ రివ్యూ

Tuesday,June 25,2019 - 10:52 by Z_CLU

ఈ సీజన్ లో ఓ మోస్తరు అంచనాలు పెంచిన సినిమా కల్కి. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది. కొద్దిసేపటి కిందట మూవీ ట్రయిలర్ రిలీజ్ చేశారు. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది కల్కి ట్రయిలర్.

“శేఖర్ బాబును ఎవరు చంపారు” అనే క్యూరియాసిటీతో ట్రయిలర్ ను స్టార్ట్ చేశారు. ఎంక్వయిరీ స్టార్ట్ చేద్దాం అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్ తో ఓ క్లారిటీ ఇచ్చారు. 80ల్లో కొల్లాపూర్ లో జరిగిన ఓ మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో కల్కి సినిమాను తెరకెక్కించారనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది.

పోలీస్ పాత్రలు రాజశేఖర్ కు కొత్తకాదు. కల్కి సినిమాలో మరోసారి ఖాకీ చొక్కా వేసుకున్న రాజశేఖర్.. ఈసారి తన నుంచి మరో డిఫరెంట్ పోలీస్ ను చూడబోతున్నారని అంటున్నాడు. ట్రయిలర్ కు శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేసిన ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మించారు. అదా శర్మ, నందిత శ్వేత, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు.