రాజశేఖర్ క్లారిటీ ఇచ్చాడు

Saturday,June 30,2018 - 04:00 by Z_CLU

కొన్నాళ్ళుగా ఫ్లాప్ సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్ ఇటివలే ‘గరుడ వేగ’ సినిమాతో మళ్ళీ ఫాం లోకొచ్చిన సంగతి తెలిసిందే… ఆ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమాకు కాస్త టైం తీసుకున్న రాజశేఖర్ ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసాడు.

మొన్నటి వరకూ అ! సినిమా దర్శకుడితో రాజశేఖర్ సినిమా ఉంటుందనే వార్త వినిపించింది కానీ ఆ దర్శకుడు ఇప్పుడు ‘క్వీన్’ రిమేక్ ను హ్యాండిల్ చేస్తుండడంతో రాజశేఖర్ తో సినిమా ఉండకపోవచ్చనే టాక్ కూడా చక్కర్లు కొట్టింది. .. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేసాడు రాజశేఖర్.

తన నెక్స్ట్ సినిమా ఆసంగా ఉండబోతుందంటూ అ! అనే పదాన్ని హైలైట్ చేస్తూ తెలిపాడు..  ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేసాడు ఈ సీనియర్ హీరో. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘క్వీన్’ ఫినిష్ అవ్వగానే ఈ సినిమా స్టార్ట్ చేసే చాన్స్ ఉంది.