మరో భారీ షెడ్యూల్ జరుపుకోనున్న 'సాహో'

Saturday,June 30,2018 - 04:19 by Z_CLU

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ మూడో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఇటివలే దుబాయ్ లో ఓ భారీ షెడ్యూల్ ఫినిష్ చేసిన యూనిట్ జులై 11 నుండి హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ లో కొన్ని లోకేషన్స్ తో పాటు భారీ సెట్స్ లో ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ , శ్రద్దా కపూర్ లపై అలాగే  మిగతా నటీ నటులపై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేయనున్నారు.

యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ గా ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్ విలన్ గా నటిస్తున్నాడు. శంకర్ ఇశాన్ లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.