ఇదే ఫస్ట్ టైం -నారా రోహిత్

Saturday,June 30,2018 - 03:08 by Z_CLU

నారా రోహిత్ , జగపతి బాబు కాంబినేషన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘ఆటగాళ్ళు’ ట్రైలర్ విడుదలైంది. మేకర్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో  శేకర్ కమ్ముల ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు . ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ ” నటుడిగా కొన్ని థ్రిల్లర్ సినిమాలు చేశాను కానీ ఫస్ట్ టైం మర్డర్ మిస్టరీ తో చేసిన సినిమా ఇది. ఈ జోనర్ లో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం… ఈ సినిమా నాకు కొత్త అనుభూతి కలిగించింది. ముఖ్యంగా జగపతి బాబు గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీ గా ఉందని” తెలిపాడు.

నారా రోహిత్ అప్ కమింగ్ డైరెక్టర్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రవీంద్ర , శివాజీ,రాము, జితేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాకు పరుచూరి మురళి దర్శకుడు.