ఈసారి కూడా రాజమౌళి మారిపోయాడు

Wednesday,May 22,2019 - 11:02 by Z_CLU

రాజమౌళి సినిమాలకు మొదటి హీరో రాజమౌళినే.. తన హీరో ఎలా కనబడాలో… ఏమేం చేయాలో ప్రతీది తను చేశాకే హీరోలను రంగంలోకి దింపుతాడు.

‘బాహుబలి’ సినిమా విషయంలో కూడా వర్కింగ్ వీడియోస్ ని గమనిస్తే చాలా సీన్స్ లో పర్ఫామ్ చేస్తూ కనిపిస్తాడు జక్కన్న.. ఏనుగు ఎక్కడం దగ్గరి నుండి కొన్ని వార్ సీక్వెన్సెస్ లో కూడా పర్ఫెక్ట్ గా కత్తి తిప్పుతూ కనిపిస్తాడు.

ఇప్పుడు రాజమౌళి లైఫంతా ‘RRR’ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కోసం ఏకంగా అటు కొమురం భీమ్, ఇటు అల్లూరి సీతారామరాజు రెండేసి రోల్స్ లో బ్రతికేస్తున్నాడు. ఈ మాటని ఖచ్చితంగా చెప్పేయడానికి RRR స్టిల్స్, వీడియోస్ లాంటివి ఇంకా బయటికి రాలేదు కానీ, మొన్నటికి మొన్న NTR బర్త్ డే సందర్భంగా, రాజమౌళి పోస్ట్ చేసిన ఫోటోలో అచ్చం NTR లా కనిపిస్తున్నాడు రాజమౌళి.

ఈ ఫోటోని గమనిస్తే NTR షర్ట్ దగ్గరి నుండి తలకు పెట్టుకున్నబ్యాండ్ వరకు… రాజమౌళి కూడా హీరోలాగే కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలలో ఎగ్జాక్ట్ గా NTR గెటప్ లాంటివేమీ బయటికి రాలేదు కానీ, RRR సెట్స్ లో ఏదో ప్రత్యేకమైన సందర్భంలో దిగిన ఫోటో అని తెలిసిపోతుంది. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఫోటో…

NTR బర్త్ డే కాబట్టి కొమురం భీమ్ స్టైల్ లో అలా మచ్చుకు కనిపించిన జక్కన్న, చెర్రీ బర్త్ డే నాటికి అటూ ఇటుగా చెర్రీ గెటప్ లో కనిపించడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.