స్టార్ హీరోలకు దూరంగా హీరోయిన్లు

Wednesday,May 22,2019 - 12:03 by Z_CLU

స్టార్ హీరో సినిమాల్లో చాన్స్ దొరికితే రేంజ్ మారిపోతుంది. ఆ రేంజ్ ని ఆల్మోస్ట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు హీరోయిన్స్. ఒక్కోసారి క్యారెక్టర్స్ కి అంతగా ఇంపార్టెన్స్ లేదు అని తెలిసినా, ఆ సినిమాకి అంత ఈజీగా నో చెప్పరు… అలాంటిది ఈ హీరోయిన్స్ మాత్రం గత కొన్ని రోజులుగా స్టార్ హీరోలకు దూరంగా ఉంటున్నారు… స్టోరీ బావుండి పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలకే ఓటేస్తున్నారు…

తమన్నా: తమన్నా చేతిలో ప్రస్తుతం ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. ప్రస్తుతానికి ‘అభినేత్రి 2’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. దాంతోపాటు ‘దటీజ్ మహాలక్ష్మి’ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్సవ్వాల్సి ఉంది. మహా అయితే ‘సైరా’ సినిమా… అందులో నటిస్తున్న తమన్నాది ఫీమేల్ లీడ్ రోల్… కథలో కాస్త ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది.

కాజల్ అగర్వాల్ : ‘ఖైదీ నంబర్ 150’ తరవాత ఆల్మోస్ట్ కాజల్ పిక్ చేసుకునేవన్నీ స్టోరీ బేస్డ్ సినిమాలే. ‘నేనే రాజు నేనే మంత్రి’ దగ్గరి నుండి బిగిన్ అయితే ‘అ!’, MLA, కవచం, ఇప్పుడు ‘సీత’.. ఎక్కడా స్టార్ హీరోని ప్రిఫర్ చెయ్యలేదు కాజల్ అగర్వాల్.

అనుష్క : అనుష్క డైరీలో ప్రస్తుతానికి లాస్ట్ టైమ్ చేసిన స్టార్ హీరో ప్రభాస్… ఆ తరవాత చేసిన ‘భాగమతి’ లో స్టార్ హీరో లేడు… ఇంకా చెప్పాలంటే అసలు హీరోనే లేడు ఆ సినిమాలో. ఇప్పుడు చేస్తున్న సైలెన్స్ లో కూడా నో స్టార్ హీరో… అదన్నమాట సంగతి…