అంజలి దృష్టిలో ‘మల్టీస్టారర్’

Wednesday,May 22,2019 - 10:02 by Z_CLU

‘నాకు మల్టీస్టారర్స్ కొత్త కాదు…’ అని చెప్పుకుంది అంజలి. అవునా.. అని ఓ సారి ఆలోచిస్తే టక్కన ‘సీతమ్మ వాకిట్లో’.. గుర్తుకొచ్చేస్తుంది. అది సరే… కానీ ఇప్పుడు అంజలి చేస్తున్న మల్టీస్టారర్ ఏంటి..? ఇంతకీ ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన..? అంటే… దానికి అంజలి చేసిన స్టేట్ మెంట్ పై కొంచెం ఫోకస్ పెట్టాలి…

రీసెంట్ గా ‘లీసా’ ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలి అనుష్క ‘సైలెన్స్’ గురించి… అందులో తన రోల్ గురించి అడిగినప్పుడు సినిమా గురించి పెద్దగా రివీల్  చేయలేదు కానీ.. అనుష్క తో కలిసి చేస్తున్నందుకు చాలా హ్యాప్పీగా ఉందని చెప్పుకుంది. ఈ ఫ్లో లోనే మల్టీస్టారర్ తనకు కొత్త కాదు అని కూడా చెప్పుకుంది… అదెలా అంటే…

 

గతంలో ‘బలుపు’ సినిమాలో శృతిహాసన్ కూడా హీరోయిన్.. అంతెందుకు సీతమ్మ వాకిట్లో సినిమాలో కూడా సమాంత ఉంది.. ఇప్పుడు ‘సైలెన్స్’ లో కూడా అనుష్క ఉంది. కాబట్టి అలా అంజలికి మల్టీస్టారర్స్ అలవాటైపోయాయన్న మాట…

ఇక్కడ అంజలి దృష్టిలో మల్టీస్టారర్ అంటే, ఇద్దరు స్టార్ హీరోల సినిమా కాదు… సినిమాలో ఇంకో స్టార్ హీరోయిన్ ఉండటం అన్నమాట… అదన్నమాట సంగతి. ‘సైలెన్స్’ లో తన రోల్ గురించి చెప్పగానే నచ్చేసిందని… ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని చెప్పుకుంది అంజలి.