రీప్లేస్ అయిన హీరోయిన్స్

Friday,September 06,2019 - 10:02 by Z_CLU

సినిమా లాంచ్ అయ్యేంత వరకు ఈ సినిమాకి ఈ హీరోయినే ఫిక్సయిపోతుంది. కానీ ఈ లోపు డిఫెరెంట్ రీజన్స్ హీరోయిన్స్ రీప్లేస్ అవుతునారు. ఇలాంటి సందర్భాల్లో జస్ట్ కొత్త హీరోయిన్స్ విషయంలోనే కాదు.. స్టార్ హీరోయిన్స్ విషయంలోనూ జరుగుతుంది.

 

రాశిఖన్నా: నిజానికి ‘వెంకీమామ’ నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించాలి. కానీ లాస్ట్ మూమెంట్ డేట్స్ సర్దుబాటు కాక, రకుల్ ప్రీత్ తప్పుకునేసరికి ఆ ప్లేస్ లో, రాశిఖన్నా ఫిక్సయింది. సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది.

కృతి శెట్టి : సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాలో మొదట ఫిక్సయింది మనీషా రాజ్. సినిమా లాంచ్ వరకు ఈ సినిమాలో హీరోయినా మనీషా రాజ్ అనే అనుకున్నారు. కానీ  సెట్స్ పైకి వచ్చేసరికి ఆ ప్లే కృతి శెట్టి ఫిక్సయింది.

అవికా గోర్ : ‘రాజుగారి గది 3’ లో మొదట ఫిక్సయిన స్టార్ హీరోయిన్ తమన్నానే. ఎప్పుడైతే ఈ సినిమాలో తమన్నా నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ అయిందో, ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. కానీ లాస్ట్ మూమెంట్ లో ఈ సినిమా నుండి తమన్నా తప్పుకోవడంతో, ఆ ప్లేస్ ని అవిక గోర్ రీప్లేస్ చేసింది.

రాజమౌళి RRR లో కూడా అంతే. NTR సరసన హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ ని ఫిక్సయ్యారు కానీ కొన్నాళ్ళ తరవాత పర్సనల్ రీజన్స్ అంటూ, డైసీ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో ఇంకొకరిని ఫిక్సయ్యారు. అది ఎవరన్నది ఇంకా అఫీషియల్  గా అనౌన్స్ చేయలేదు.