‘RRR’ లో విలన్స్ ఈసారి చాలా డిఫెరెంట్

Thursday,November 21,2019 - 10:02 by Z_CLU

‘రాజమౌళి విలన్’ అంటేనే ఓ మార్క్. అందునా RRR లో ఇద్దరు టాప్ హీరోలు NTR… రామ్ చరణ్. వీరిద్దరి స్థాయిలో విలన్ ఎలా ఉండబోతున్నాడు…? ఇది నిన్నా మొన్నటి వరకు ఫ్యాన్స్ లో రేజ్ అయి ఉన్న క్వశ్చన్. అంతలో మేకర్స్ నిన్న ఈ సినిమా విలన్ ని రివీల్ చేసేసరికి చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది. దాంతో పాటు ఈ క్యారెక్టర్స్ చుట్టూ మరింత క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది.

మామూలుగా తన విలన్స్ బలంగా ప్రెజెంట్ చేస్తాడు రాజమౌళి. కొన్ని సందర్భాల్లో హీరో కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు విలన్. ఆయుధాల దగ్గరి నుండి ప్రతీది కొత్తగా ప్రెజెంట్ చేస్తాడు. అలాంటిది ఈసారి రేంజ్ మరింత పెరిగి  హాలీవుడ్ విలన్స్ ఫ్రేమ్ లోకి వచ్చారు. ఇప్పుడేం చేయబోతున్నాడు…?

రే స్టీవెన్ సన్, ఆలిసన్ డూడీ లిద్దరూ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అటు అల్లూరి సీతారామరాజు, ఇటు కొమురం భీమ్ లిద్దరితో, వీళ్ళిద్దరూ ఏ విషయంలో తలపడబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా, ఈ రోజు రిలీజైన స్టిల్, పేరును బట్టి చూస్తే రే స్టీవెన్ సన్ ప్లే చేస్తున్న ‘స్కాట్’ క్యారెక్టర్ ఆర్మీ ఆఫీసర్ అని తెలుస్తుంది.

విలన్ అనగానే అవుట్ స్టాండింగ్ మాసిజం ఎలివేట్ చేసే రాజమౌళి ఈసారి ఈ హాలీవుడ్ నటులతో మరింత డిఫెరెన్స్ ని క్రియేట్ చేయబోతున్నాడు. వీరి క్యారెక్టరైజేషన్స్ దగ్గరి నుండి యాక్షన్ సీక్వెన్సెస్ వరకు ప్రతీది మరింత స్పెషల్ కానున్నాయి.