బాహుబలికి మాహిష్మతి – మరి RRR కి..?

Saturday,March 16,2019 - 01:02 by Z_CLU

RRR సినిమా అల్లూరి సీతా రామరాజు, కొమురం భీమ్ ల జాయింట్ బయోపికా…? అస్సలు కాదు. కేవలం 1920 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సినిమాకి ఈ ఇద్దరు రియల్ హీరోల క్యారెక్టర్స్ ని వాడుకుంటున్నాడు. అటు అల్లూరి సీతారామరాజు, ఇటు కొమురం భీమ్ లిద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిన టైమ్ పీరియడ్ లో ఒకవేళ కలుసుకుని ఉంటే ఏం జరిగేది అనే పాయింట్ తో ఒక ఫిక్షనల్ కథ రెడీ చేసుకున్నాడు. అదంతా సరే… వాళ్ళిద్దరూ కలుసుకున్నాక ఏం జరిగేదనేది సినిమాలో ఎలాగూ చూస్తాం.. మరి వాళ్ళు ఎక్కడ కలుసుకునేది..? దాని సంగతేంటి…?

 

ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పెసినట్టే చెప్పిన రాజమౌళి నిజంగా ఇప్పటికీ కథ చెప్పనే లేదు. మహా అయితే ఆ కథ ఏ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందనేది క్లారిటీ ఇచ్చాడంతే. ఆ క్లారిటీ ఇచ్చాడు కాబట్టే ఇప్పుడీ క్వశ్చన్ రేజ్ అవుతుంది. బాహుబలి కోసం మాహిష్మతి లాంటి భారీ సామ్రాజ్యాన్ని స్థాపించిన జక్కన్న, ఈ వీరులిద్దరి కోసం ఏం చెక్కబోతున్నాడు.

 

భారీ సెట్ ఉండబోతుందన్న క్లారిటీ ఇచ్చాడు ప్రెస్ మీట్ లోనే. దానికి తగ్గట్టు అవసరమైన చోట్ల గ్రాఫిక్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి అని చెప్పుకున్నాడు జక్కన్న. అటు కథలో ఉత్తర భారత దేశంతో కూడా కనెక్టివిటీ ఉంటుందని క్లారిటీ కూడా ఇచ్చేశాడు.అందుకే మరో విజువల్ వండర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై రోజుకో క్వశ్చన్ రేజ్ అవుతూనే ఉంది.

కథ ఎంత స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకుంటాడో, అందులోని క్యారెక్టర్స్ పై కూడా అంతే దృష్టి పెడతాడు. వాటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో మరింత అందమైన నేటివిటీని కూడా క్రియేట్ చేసుకుంటాడు. బ్రిఅందుకే ఇప్పుడు రేజ్ అవుతున్న మిలియన్ డాలర్ క్వశ్చన్…. బ్రిటీష్ కాలం నాటి ఈ ‘RRR లో రాజమౌళి క్రియేట్ చేయనున్న కొత్త సామ్రాజ్యమేంటి..? ఏముంది… దీనికి సమాధానం దొరకాలంటే కనీసం ఈ సినిమా నుండి టీజరైనా రిలీజ్ కావాలి. అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప ఆప్షన్స్ లేవు.