రాజమౌళి సినిమాలో మహేష్ బాబు - ఒకటే కండిషన్

Saturday,March 16,2019 - 12:02 by Z_CLU

ఒక పర్టికులర్ స్టార్ తో సినిమా అని ఎప్పుడూ పెట్టుకోడు. ఒక కథ అనుకుంటాడు. దానికి తగ్గట్టే స్టార్స్ ని  ఎంచుకుంటాడు. ఈ పద్ధతే, రాజమౌళి సినిమాల్లో మహేష్ బాబు లేకుండా చేస్తుంది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమాని ప్లాన్ చేసుకునే జక్కన్న, బాహుబలి తరవాతైనా మహేష్ బాబు తో సినిమా చేయకపోతాడా అనే ఆశ, RRR అనౌన్స్ చేసినప్పుడే నీరు కారిపోయింది.

అంతెందుకు RRR లో కూడా ఒక హీరోగా మహేష్ బాబును ఫిక్స్  చేసుకోగలిగే అవకాశం 100% ఉన్నా, ఫ్యాన్స్ లో మహేష్ బాబును అల్లూరి సీతారామ రాజుగా కన్నా, జేమ్స్ బాండ్ గా చూడాలనే డిమాండ్ ఎక్కువగా ఉందనే రీజన్ తో ఆ ఆలోచనే మానుకున్నాడు. అంటే అప్పటికే RRR మైండ్ లో ఉన్న రాజమౌళి, స్టార్ కాస్ట్ ని ఫిక్స్ చేసుకోకముందే, ఫ్యాన్స్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

సినిమా సక్సెస్ కి ఫ్యాన్స్ అంచనాలకి దగ్గర సంబంధం ఉంటుంది. రాజమౌళి ఎలాంటి చేసినా టార్గెట్ మాత్రం ఫ్యాన్సే. సినిమా చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అంచనాలు రీచ్ అవ్వాల్సిందే అనే కసితో చేస్తాడు… ప్రమోట్ చేసేటప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి అసలు ఈ సినిమా నుండి ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చనే క్లారిటీ కూడా తనే ఇస్తాడు. రాజమౌళి సక్సెస్ మంత్రం ఇదే.

రాజమౌళి డైరక్షన్ లో మహేష్ బాబు నటించే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. జక్కన్న తలుచుకుంటే అది నెక్స్ట్ సినిమాకే పాసిబుల్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఈసారి ‘స్టోరీ ముందు… స్టార్ తరవాత’  ఫార్మాట్ లో అయితే అస్సలు కుదరదు. ఖచ్చితంగా మహేష్ బాబు తోనే సినిమా చేయాలి అని ఫిక్సయితే కానీ ఈ కాంబో సాధ్యపడదు. దానికి ముందుగా రాజమౌళి తన తరహాలో ఫ్యాన్స్ మహేష్ బాబును ఎలా చూడాలనుకుంటున్నారో బేరీజు వేసుకోవాలి. దానికి తగ్గట్టే జక్కన్న సబ్జెక్ట్ రెడీ చేసుకోవాలి.  అప్పుడే ఈ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ సెట్స్ పైకి వస్తుంది.