నాగచైతన్య ‘ప్రేమమ్’ వర్సెస్ ‘మజిలీ’

Saturday,March 16,2019 - 02:04 by Z_CLU

‘మజిలీ’ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఫిల్మ్ మేకర్స్ కూడా సినిమాని వీలైనంత వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో రీసెంట్ గా ఈ సినిమా నుండి ‘ప్రియతమా.. ప్రియతమా..’ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సింగిల్ లో ఉన్న కొన్ని విజువల్స్ నాగచైతన్య ‘ప్రేమమ్ సినిమాని గుర్తు చేశాయి.

 

‘మజిలీ’ సినిమాకి ‘ప్రేమమ్’ సినిమాకి కొన్ని దగ్గర పోలికలున్నాయి. కథలో కాదు… సినిమా కథ బిగిన్ అయ్యే విధానం లో. ప్రేమమ్ లో కూడా టీనేజ్ ఇన్సిడెంట్స్ ఉంటాయ్.. ఈ సినిమాలో కూడా ఉండబోతున్నాయి. ప్రేమమ్ సినిమాలో హీరో చైతు లైఫ్ లో ముగ్గురమ్మాయిలు.. ఈ సినిమాలో ఇద్దరూ… కాకపోతే ఈ సినిమాలో సమంతా రోల్ చుట్టూ కావాల్సినంత ఎమోషనల్ వింగ్ ఉంటుంది.

 

ప్రేమమ్ సినిమాలో చైతుకి , అనుపమ పరమేశ్వరన్ కి మధ్యకొన్ని చోట్ల టీనేజ్ స్థాయి కెమిస్ట్రీ ఎలివేట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ‘మజిలీ’ లో సమంతాది వన్ సైడెడ్ లవ్. ఎక్కడా నాగచైతన్య, సమంతాకి కనెక్ట్ అయ్యే దాఖలాలు కనిపించట్లేదు. పైగా టీజర్ ని బట్టి, ఆ టైమ్ లో వేరే అమ్మాయితో లవ్ లో ఉంటాడు చైతు. ప్రేమమ్ కథ కంప్లీట్ గా వేరు.

 

ఇక ‘మజిలీ’ లో మూడో అమ్మాయి లేదు. ఇక్కడ సమంతానే ఉంటుంది… దానికి తోడు గడిచిన జీవితంలోని ఫెయిల్యూర్స్ ఓ వైపు, నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోలేకపోవడం లాంటి డిఫెరెంట్ క్యారెక్టరిస్టిక్స్ తో చైతు క్యారెక్టర్ మరింతగా కనెక్ట్ అయ్యే స్థాయిలో ఉంటుందని అర్థమవుతుంది.