RRR కోసం కూడా తప్పట్లేదు...

Wednesday,July 10,2019 - 11:02 by Z_CLU

‘అరవిందసమేత’ లో విశ్వరూపం చూపించాడు NTR. ఈ సినిమా కోసం టఫ్ఫెస్ట్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ ఇంపాక్ట్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ లో ఈజీగా కనిపించింది. అయితే ఇప్పుడు చేస్తున్న ‘RRR’ కోసం కూడా అంతే కష్టపడుతున్నాడు NTR.

ప్రస్తుతం బ్రేక్ మోడ్ లోఉంది RRR టీమ్. అయితే NTR మాత్రం కొన్ని సన్నివేశాల్లో ప్రత్యేకంగా కనిపించడం కోసం ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాడు. దీనికి సంబంధించి NTR పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశాడు.

 కొమరం భీమ్ లా కనిపించబోతున్నాడు NTR ఈ సినిమాలో. అప్పుడెప్పుడో ప్రెస్ మీట్ లో కనిపించడం తప్ప, మళ్ళీ మీడియా ముందుకు రావడం కానీ, ఏ ఇతర ఈవెంట్స్ కి సంబంధించిన ఫోటోల్లో కానీ.. ఎక్కడా తన లుక్స్ బయటపడకుండా మెయిన్ టైన్ చేస్తున్న NTR, ఈ సినిమా కోసం మరింతగా కష్టపడుతున్నాడు.

రాజమౌళి హీరోలంటేనే ఓ రేంజ్. అందునా NTR కనిపించబోయేది కొమురం భీమ్ లాంటి రియల్ హీరో క్యారెక్టర్ లో.. అందుకే ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు యంగ్ టైగర్.