బెజవాడ అమ్మాయితో ప్రేమలో పడిన రాజ్ తరుణ్

Friday,June 14,2019 - 06:01 by Z_CLU

తను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని ఇప్పటికే ట్విట్టర్ లో ప్రకటించాడు రాజ్ తరుణ్. అయితే అప్పుడు ఆ అమ్మాయి డీటెయిల్స్ మాత్రం బయటపెట్టలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేయసి, కాబోయే భార్య వివరాలు బయటపెట్టాడు

రాజ్ తరుణ్ ప్రేమిస్తున్న అమ్మాయిది విజయవాడ. ఆమెకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదంటున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఆరేళ్ల కిందట ఆ అమ్మాయిని కలిశాడట. అప్పట్నుంచి ఆమెతో డేటింగ్ చేస్తున్నాడట. ఇప్పుడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడట.

అయితే అమ్మాయి పేరును మాత్రం రాజ్ తరుణ్ బయటపెట్టలేదు. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయాన్ని కూడా చెప్పలేదు.