వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటా

Monday,December 10,2018 - 04:31 by Z_CLU

హీరో రాజ్ తరుణ్ పెళ్లికబురు మోసుకొచ్చాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఈ హీరో. అంతకుమించి తన పెళ్లికి సంబంధించి పెద్దగా వివరాలు బయటపెట్టలేదు. అభిమానులతో ట్విట్టర్ లో ఛాట్ చేసిన ఈ హీరో, ఇలా పెళ్లి కబురు బయటపెట్టాడు.

పెళ్లితో పాటు తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో వివరాల్ని రాజ్ తరుణ్ బయటపెట్టాడు. తన కెరీర్ లో ఉయ్యాల జంపాల సినిమాను బెస్ట్ మూవీగా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆ సినిమాకు రాజ్ తరుణ్ రైటర్ గా కూడా వర్క్ చేశాడట.

అంతేకాదు, విలన్ గా కూడా నటిస్తానంటున్నాడు ఈ లవర్ బాయ్. తనకు విలన్ గా కనిపించడం ఇష్టమని, మహేష్ బాబు సినిమాలో అవకాశం వస్తే విలన్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేశాడు.