ఈ నెలలోనే రాజ్ తరుణ్ కొత్త సినిమా

Monday,July 02,2018 - 02:07 by Z_CLU

రాజ్ తరుణ్ సిద్ధి ఇద్నాని జంటగా నటించిన ‘లవర్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. రిలీజ్ డేట్ కన్నా ముందే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి, సినిమాపై   క్యూరియాసిటీని జెనెరేట్  చేసిన   ఫిల్మ్ మేకర్స్, జూలై 20 న సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో కరియర్  ని ప్లాన్ చేసుకుంటున్న రాజ్ తరుణ్, ఈ సినిమాలో లవర్ బాయ్ లా స్టైలిష్ లుక్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్ యూత్ లో సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేశాయి.

 

ఇమోషనల్ లవ్  ఎలిమెంట్స్  తో  పాటు ఇంట్రెస్టింగ్ కాంఫ్లిక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి అంకిత్ తివారి, సాయి కార్తీక్, తనిష్ బగ్చి, అర్కో, రిషి రిచ్ ఐదుగురు  మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సినిమాకి హర్షిత్ రెడ్డి ప్రొడ్యూసర్. అనీష్ కృష్ణ డైరెక్టర్.