ఇస్మార్ట్ శంకర్.. జిందాబాద్ సాంగ్ రిలీజ్

Friday,June 14,2019 - 05:28 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజైంది. జిందాబాద్ అనే లిరిక్స్ తో సాగే ఈ పాట పక్కా రొమాంటిక్ నంబర్. పూరి ఆస్థాన లిరిసిస్ట్ భాస్కరభట్ల రాసిన ఈ పాటను శరత్ సంతోష్, రమ్య బెహర పాడారు. మణిశర్మ మ్యూజిక్ ఇచ్చారు.

గోవాలోని అందమైన లొకేషన్లలో రామ్, నభా నటేష్ మధ్య ఈ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు. ఆ మేకింగ్ షాట్స్ కూడా లిరికల్ వీడియోలోనే చూపించారు. పనిలోపనిగా అదే స్పాట్ లో జరిగిన రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను కూడా లిరికల్ వీడియోలో చూడొచ్చు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దిమాక్ ఖరాక్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. అదొక మాస్ నంబర్. ఇప్పుడు క్లాసీగా ఉండే ఈ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. ఇదే వరసలో మిగతా పాటల్ని కూడా బ్యాక్ టు బ్యాక్ మినిమం గ్యాప్ లో రిలీజ్ చేయబోతున్నారు.

నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చేనెల 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.