డిసెంబర్ నుండి రాజ్ తరుణ్ కొత్త సినిమా

Monday,November 27,2017 - 05:10 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ అకౌంట్ లో మరో మూవీ చేరింది. ప్రస్తుతం సంజనా రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రాజుగాడు’ సినిమాతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మరో సినిమాతో సెట్స్ పై ఉన్న రాజ్ తరుణ్, డిసెంబర్ లో మరో సినిమాతో బిజీ కానున్నాడు.

అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘లవర్’ సినిమాతో డిసెంబర్ 11 నుండి సెట్స్ పైకి రానున్నాడు రాజ్ తరుణ్. గతంలో ‘అలాఎలా’ సినిమాతో డీసెంట్ హిట్ ని బ్యాగ్ లో వేసుకున్న అనీష్ కృష్ణ, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో మరో సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

 

ప్రేమకథల్లో సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌  యాంగిల్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన గీతా సురేష్ హీరోయిన్ గా నటించనుంది. మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.