వీకెండ్ రిలీజెస్

Wednesday,July 18,2018 - 10:01 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన చినబాబు, విజేత, RX 100. జోనర్ దగ్గరి నుండి బిగిన్ అయితే  రిలీజైన అయిన తరవాత క్రియేట్ అయిన క్రేజ్ వరకు దేనికదే స్పెషల్ అనిపించుకున్నాయి ఈ సినిమాలు. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించుకున్న ‘చినబాబు’ వర్షాలు కూడా లెక్కచేయకుండా ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయితే, విజేత, RX100 కూడా బాక్సాఫీస్ దగ్గర పరవాలేదనిపించుకుంటున్నాయి.

ఈ వీకెండ్ పెద్ద స్టార్స్ సినిమాలేవీ లేకపోవడంతో పక్కా ప్లానింగ్ తో మరో 3 సినిమాలు రిలీజవుతున్నాయి. దాంతో పాటు శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటించిన బాలీవుడ్ సినిమా ‘ధడక్’ కూడా ఈ ఫ్రైడే రిలీజవుతుండటంతో  టాలీవుడ్ లో ఈ సినిమాపై కూడా వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

 

లవర్ : రాజ్ తరుణ్, రిద్ధి కుమార్ జంటగా నటించిన సినిమా ఇది. అయితే ఇప్పటికే ఆడియో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా, బాక్సాఫీస్ దగ్గర కూడా అదే స్థాయిలో నిలబడుతుందా..? అది ఈ ఫ్రైడే తెలిసిపోతుంది.గతంలో ‘అలా ఎలా’ సినిమాతో మెస్మరైజ్ చేసిన దర్శకుడు అనీష్ కృష్ణ, డెఫ్ఫినేట్ గా ఇంప్రెస్ చేస్తాడనే కాన్ఫిడెంట్  గా ఉన్నారు ఆడియెన్స్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్ చూస్తుంటే, రాజ్ తరుణ్ కరియర్ మళ్ళీ  సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే అనిపిస్తుంది.

 

ఆటగదరా శివ

ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కింది ఆటగదరా శివ. ఉరిశిక్ష పది జైలు నుండి తప్పించుకున్న ఖైదీకి, జైలులో ఖైదీలకు ఉరి వేసే వ్యక్తి మధ్య జరిగే కథే ఈ ‘ఆటగదరా శివ’. ఈ 2 క్యారెక్టర్స్ తో దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ సిల్వర్ స్క్రీన్ పై ఏం చెప్పదలుచుకున్నాడనేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పడం కష్టం. ఈ ఫ్రైడే రిలీజవుతున్న ఈ సినిమాని రాక్ లైన్  వెంకటేష్ నిర్మించాడు.

 

W/O రామ్

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్సివ్ థ్రిల్లర్ ‘w/o రామ్. తన భర్తను చంపిన వారెవరో తెలుసుకోవాలనే W/O రామ్ ఆ మర్డరర్స్ పట్టుకోగలుగుతుందా..? అసలీ W/O రామ్ ఎవరు..? అసలా మర్డర్ వెనక మిస్టరీ ఏంటి..? లాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్. ఇక అసలు విషయం రివీల్ అవ్వాలంటే ఫ్రైడే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా విజయ్ యెలకంటి డైరెక్షన్ లో తెరకెక్కింది.

ధడక్

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, ఇషాన్ ఖతార్ జంటగా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ధడక్. మరాఠి బ్లాక్ బస్టర్ ‘సైరత్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజవుతుంది. రెగ్యులర్ సినిమాల కన్నా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ డైరెక్టర్.

పరిచయం

విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ పరిచయం. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిందని ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ తో ఇప్పటికే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. జూలై 21 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకి లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు.