జీ సినిమాలు ( 15th జూన్ )

Friday,June 14,2019 - 10:05 by Z_CLU

కొత్త బంగారు లోకం
నటీనటులు : వరుణ్ సందేశ్శ్వేత బసు ప్రసాద్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్జయసుధఆహుతి ప్రసాద్రజితబ్రహ్మానందం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008
శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

=============================================================================

మిస్టర్

నటీనటులు వరుణ్ తేజ్లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : హేబా పటేల్నిఖితిన్ ధీర్ప్రిన్స్ సీసిల్పృథ్వీ రాజ్హరీష్ ఉత్తమన్రవి ప్రకాష్సత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ. జె. మేయర్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జిఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017 

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరాచై కి ఏం చెప్పిందిచై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరుచివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

============================================================================

స్పైడర్
నటీనటులు : మహేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్యభరత్, RJ బాలాజీప్రియదర్శిజయప్రకాష్సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017
ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.
అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

==============================================================================

రెడీ

నటీనటులు రామ్జెనీలియా
ఇతర నటీనటులు బ్రహ్మానందంనాజర్చంద్రమోహన్తనికెళ్ళ భరణికోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డిసుప్రీత్షఫీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్
రిలీజ్ డేట్ : 19 జూన్ 2008
రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

శైలజా రెడ్డి అల్లుడు
నటీనటులు నాగ చైతన్యఅనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్నరేష్మురళీ శర్మకళ్యాణి నటరాజన్వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్
డైరెక్టర్ : మారుతి దాసరి
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018
ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనంఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ).
తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడువాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

==============================================================================

మిరపకాయ్
నటీనటులు : రవితేజరిచా గంగోపాధ్యాయ
ఇతర నటీనటులు : సునీల్దీక్షా సేథ్ప్రకాష్ రాజ్కోట శ్రీనివాస రావునాగబాబుస్వాతి రెడ్డిసంజయ్ స్వరూప్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
ప్రొడ్యూసర్ : రమేష్ పుప్పల
రిలీజ్ డేట్ : 12 జనవరి 2011
రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్స్ పెక్టర్ గా నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిరపకాయ్. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీయాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.