సెట్స్ పైకి రానున్న రాజ్ తరుణ్ కొత్త సినిమా

Thursday,August 30,2018 - 01:52 by Z_CLU

కొత్త సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు రాజ్ తరుణ్.  రీసెంట్ గా ‘లవర్’ సినిమాతో ఎంటర్ టైన్ చేసిన ఈ హీరో, ఇప్పుడు మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో సెట్స్ పైకి రానున్నాడు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకుడు.

హిలేరియస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గూఢచారి’ ని నిర్మించిన అభిషేక్ నామా ఈ సినిమాకి ప్రొడ్యూసర్.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించబోయే హీరోయిన్ తో పాటు టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ఫిలిమ్ మేకర్స్  త్వరలో ఈ సినిమా డీటేల్స్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.