మరోసారి జోడీ కట్టనున్న రాజ్ తరుణ్ - హెబ్బా పటేల్

Sunday,June 10,2018 - 04:04 by Z_CLU

తమిళ్ బ్లాక్ బస్టర్ ‘నానం రౌడీ దాన్’ రీమేక్ లో నటించనున్నాడు రాజ్ తరుణ్. C. కళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. అయితే ఫిల్మ్ మేకర్స్  ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్ ని కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫం అయితే కాలేదు కానీ, అప్పుడే టాలీవుడ్ లో ఈ సినిమా డిస్కర్షన్స్  బిగిన్ అయిపోయాయి.

రివేంజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ  సినిమా తమిళ వర్షన్ లో నయనతార హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ పర్ఫామెన్స్ కి భారీ స్కోప్ ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ప్లానింగ్ లో ఉన్న ఈ సినిమా యూనిట్,  హీరోయిన్ హెబ్బా పటేల్ అయితే
సినిమాలో ఈ ఇద్దరి సిల్వర్  స్క్రీన్  కెమిస్ట్రీ అదిరిపోతుందని భావిస్తున్నారట.

యూత్ ఫుల్ ఎంటర్ తినర్స్ తో కరియర్ ప్లాన్ చేసుకుంటున్న రాజ్ తరుణ్, ఈ సినిమా తన కరియర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవ్వడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ ఉన్నాడు. ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకునే  ప్రాసెస్ లో ఉన్న ఫిలిం మేకర్స్ వీలైనంత త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.