కుమారి 21 F కాంబో లాంచ్ డేట్ ఫిక్సయింది

Saturday,March 24,2018 - 02:40 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది త్వరలో సెట్స్ పైకి రానున్న రాజ్ తరుణ్ కొత్త సినిమా. సూర్య  ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. కుమారి 21 F లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత తెరకెక్కనున్న ఈ సినిమాని  ఏప్రిల్ 18 నుండి గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

కుమారి 21 F రాజ్ తరుణ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ లా నిలిచింది. మరోసారి అదే రేంజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేసుకున్న సూర్య ప్రతాప్, ఈ సినిమా కూడా అదే రేంజ్ సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

SRT ఎంటర్  టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించబోయే హీరోయిన్ ని ఫిక్స్ ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. సినిమా ప్రారంభోత్సవం నాడు సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ అనౌన్స్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్.