నయనతార ‘కోకోకోకిల’ హైలెట్స్

Thursday,August 30,2018 - 04:28 by Z_CLU

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘కోకోకోకిల’ రేపే గ్రాండ్ గా రిలీజవుతుంది. ఇప్పటికే తమిళంలో రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా, తెలుగులోనూ అదే స్థాయి వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది. అయితే టాలీవుడ్ ఆడియెన్స్ లో ఈ సినిమా కంపల్సరీ గా చూడాల్సిందే అనిపించే రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తున్న హైలెట్స్ ఇవే…

సినిమాలో ఫస్ట్ ఎవర్ ఎట్రాక్షన్ నయనతార. వరసగా తన మార్క్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తున్న నయనతార గత సినిమాల సక్సెస్ ఇంపాక్ట్ ఈ సినిమాపై కూడా కనిపిస్తుంది. ట్రైలర్ నయనతార పర్ఫామెన్స్ సినిమాపై మరింత బజ్ ని క్రియేట్ చేస్తుంది.

 

ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ అనిరుద్ మ్యూజిక్. నయనతార సినిమా అనగానే క్రియేట్ అయిన పాజిటివ్ వైబ్స్ కి అనిరుద్ మ్యూజిక్ మరో ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పటికే ఆడియో మ్యూజిక్ లవర్స్ ఇంప్రెస్ చేయడం సక్సెస్ అయింది.

 

నయనతారను కంప్లీట్ గా డిఫెరెంట్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేస్తుంది ఈ సినిమా స్టోరీలైన్. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార గ్రే షేడ్స్ లో కనిపించనుంది. ఈ పాయింట్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.

 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కింది కోకోకోకిల. రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిన ఈ సినిమా, ట్రైలర్ ని బట్టి విజువల్స్ పరంగా కూడా పైసా వసూల్ అనే ఫీల్ క్రియేట్ చేస్తుంది.