YSR బయోపిక్ నుండి ఫస్ట్ సింగిల్

Thursday,August 30,2018 - 12:39 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది YSR ‘యాత్ర’. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి YSR అభిమానులతో  గా కనెక్ట్ అయిన ఫిలిమ్ మేకర్స్, ప్రస్తుతం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. సెప్టెంబర్ 2 న YSR వర్థంతి సందర్భంగా ఈ సినిమా నుండి ‘సమరశంఖం’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి Y.S. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలోని కీలక ఘట్టం ‘పాదయాత్ర’ ని నేపథ్యంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, YSR గా ఏ సినిమాలో కనిపించనున్నాడు.

70 MM ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మహి. వి. రాఘవ్ ఈ సినిమాకి డైరెక్టర్. K. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.