దిల్ రాజునే నమ్ముకున్న రాజ్ తరుణ్

Monday,March 04,2019 - 01:02 by Z_CLU

ఎంత స్పీడ్ గా రేజ్ అయ్యాడో ఇప్పుడంతే సైలెంట్ మోడ్ లో ఉన్నాడు రాజ్ తరుణ్. సినిమాలన్నాక ఫ్లాపులు, హిట్లు కామనే కానీ, కానీ అదే పనిగా రిలీజైన ప్రతి సినిమా బోల్తా పడుతుందంటే, ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టే. ఆ రియలైజేషన్ ఆల్రెడీ రాజ్ తరుణ్ కి వచ్చేసింది. అందుకే ఈ సారి కంప్లీట్ గా దిల్ రాజు పై డిపెండ్ అవుతున్నాడు.

రీసెంట్ సినిమా ‘లవర్’ ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోయినా దిల్ రాజు మాత్రం రాజ్ తరుణ్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. రాజ్ తరుణ్ కూడా ఈ సారి కంప్లీట్ గా దిల్ రాజు సలహా ప్రకారమే లుక్స్ దగ్గర నుండి ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. టైమ్ బాలేదనుకుని వదులుకున్నాడో, లేకపోతే డెసిషన్ మేకింగ్ పై నమ్మకం పోయిందో తెలీదు కానీ, రాజ్ తరుణ్  కొన్నాళ్ళు  బ్రేక్ తీసుకోవడమే బెటర్ అని ఫిక్సయిన  టైమ్ లో, రాజు గారి దగ్గరి నుండి ఆఫర్ రావడంతో, కళ్ళు మూసుకుని యస్ అనేశాడు ఈ యంగ్ హీరో.

రేపో మాపో సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమా కోసం అన్నీ తానై పర్యవేక్షిస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే మిక్కీ.జే.మేయర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన రామకృష్ణా రెడ్డి, ఈ సారి మరింత డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సెట్స్ పైకి వస్తున్నట్టు తెలుస్తుంది.

దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే మినిమం సక్సెస్ గ్యారంటీ. అందునా ఈసారి ఈ బ్రాండెడ్ ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్ మార్కెట్ తో సంబంధం లేకుండా ఇనఫ్ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నాడు. సినిమా ఏ హీరోతో చేసినా తన బ్రాండ్ వ్యాల్యూ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు దిల్ రాజు. అదే ఇప్పుడు రాజ్ తరుణ్ కి కూడా కలిసొస్తుంది.