నాగచైతన్య సినిమాలో ఇలియానా

Monday,July 02,2018 - 05:17 by Z_CLU

అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో రవితేజ సరసన నటిస్తుంది ఇలియానా. ఓ వైపు బాలీవుడ్ లో తన  మార్క్ సినిమాలతో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న ఈ గోవా బ్యూటీ, పనిలో పనిగా టాలీవుడ్ లో కూడా కాస్త గట్టిగానే ట్రై చేస్తుందనిపిస్తుంది. ప్రస్తుతం మాస్ మహారాజ్ తో సెట్స్ పై ఉన్న ఇలియానా, త్వరలో నాగచైతన్య సరసన నటించనుంది.

ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ తో పాటు  చందూ మొండేటి ‘సవ్యసాచి’ సినిమాలతో బిజీగా ఉన్నాడు చైతు. ఈ రెండు సినిమాలతో పాటు వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ లో నటించనున్న  ఈ హీరో, త్వరలో శివ నిర్వాణ  డైరెక్షన్ లోను సెట్స్  పైకి రానున్నాడు.  అయితే వరస సినిమాలతో బిజీగా నాగచైతన్యతో ఏ సినిమాలో ఇలియానా  జత కట్టనుందో ఇంకా క్లారిటీ రాలేదు.

 

రవితేజతో ‘దేవుడు చేసిన మనుషులు’ తరవాత ఇలియానా మళ్ళీ టాలీవుడ్ లో సినిమా చేయలేదు. అలాంటిది ఇన్నాళ్ళకు రవితేజ సినిమాలో ఇలియానా ఫిక్సయిందనే న్యూస్, సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాజిటివ్ వైబ్రేషన్స్ బిగిన్ అయ్యాయి. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే నాగచైతన్య సినిమాలో ఇలియానా ఫిక్సయిందనే టాక్, మరింత హీట్ జెనెరేట్ చేస్తుంది. అయితే ఈ టాక్ జస్ట్ గాసిప్ లా మిగిలిపోనుందా..? లేక అఫీషియల్ గా కన్ఫం అవుతుందా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.