రీమేక్ పై రియాక్ట్ అయిన రాజ్ తరుణ్

Friday,June 15,2018 - 09:30 by Z_CLU

తమిళ బ్లాక్ బస్టర్ ‘నానుమ్ రౌడీ దాన్’ రీమేక్ లో రాజ్ తరుణ్ నటిస్తున్నాడనే న్యూస్ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దానికి తోడు రీసెంట్ గా ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్ ని ఫిక్స్  చేసుకునే   చాన్సెస్ ఉన్నాయనే న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఈ రూమర్స్ కి  జస్ట్ ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేశాడు రాజ్ తరుణ్.

ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉందని , ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల దగ్గర్నించి టెక్నికల్ టీమ్ వరకు ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉందని క్లియర్ చేసిన రాజ్ తరుణ్, తను ఏ సినిమా రీమేక్ లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం అనీష్ కృష్ణ డైరెక్షన్ లో లవర్ సినిమాతో బిజీగా ఉన్నాడు రాజ్ తరుణ్. అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.