దిల్ రాజు ఇంటర్వ్యూ

Wednesday,July 18,2018 - 02:39 by Z_CLU

రాజ్ తరుణ్ ‘లవర్’ ఈ నెల 20 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ‘అలాఎలా’ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రీసెంట్ గా రిలీజైన ఆడియో యూత్ ని ఇంప్రెస్ చేయడం లో సక్సెస్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత ఈ సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు అవి మీకోసం…

నేనే అడిగా…

అనీష్ కృష్ణ ‘అలా ఎలా’ సినిమా చూశాక నేనే అడిగా.. ఇంకేదైనా లైన్ ఉంటే చెప్పు చేద్దాం అని… ఆ తరవాత 2016 లో కలిసినప్పుడు లైన్ చెప్పాడు. నాకు నచ్చి డెవెలప్ చేయమని చెప్పాను.. ఆ తరవాత 2017 మొత్తం నేను బిజీ అయిపోయాను… అందుకే లేటయింది.

అదీ ఈ సినిమా బడ్జెట్…

సినిమా స్క్రిప్ట్ స్టేజ్ లో ఉండగానే ఈ సినిమా రెస్పాన్సిబిలిటీ హర్షిత్ రెడ్డికి అప్పగించేసి డైరెక్టర్ కి అటాచ్ చేసేశాను. 5 కోట్ల బడ్జెట్ అని చెప్పాను బిగినింగ్ లో… కానీ హర్షిత్ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అని… దాని తరవాత ముఖ్యంగా క్లైమాక్స్ కోసం పర్టికులర్ సెటప్ అడిగాడు, దాంతో బడ్జెట్ 8 కోట్లు అయింది… సినిమా అద్భుతంగా వచ్చింది…

 

అదే సినిమా స్టోరీ…

సినిమాలో హీరో అనాథ… తన లైఫ్ లో ఏదైతే తనకు దక్కలేదో… ఫ్యామిలీ హ్యాప్పీనెస్ లాంటివి… ఫ్యూచర్ లో తన భార్యా పిల్లలకు అలాంటి పరిస్థితి రాకూడదు అని అనుకునే ఒక కుర్రాడి కథ. దాంతో పాటు సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. యాక్షన్ కూడా ఉంటుంది కానీ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ కాదు.

 

అందుకే ముగ్గురు…

హర్షిత్ కానీ డైరెక్టర్ కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మ్యూజిక్ విషయంలో ఎంత పర్టికులర్ గా ఉన్నారో సిన్మాలో యాక్షన్ విషయంలో కూడా అంతే పర్టికులర్ గా ఉన్నారు. సినిమాలో 3 ఫైట్స్ ఉంటే ముగ్గురు యాక్షన్ కొరియాగ్రాఫర్స్ ని పెట్టుకున్నారు. ఒకటి రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఫైట్ ఉటుంది. మరొకటి రాజీవ్ కనకాల.. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది.

మహా అయితే 24 గంటలు…

నేను ఏ సినిమాకి ప్రెజర్ పడను. సక్సెస్ వచ్చినా పట్టించుకోను, ఫెయిల్యూర్ వచ్చినా పట్టించుకోను.. కానీ ఈ సినిమాకి కొంచెం ప్రెజర్ ఉంది. హర్షిత్ కి ఫస్ట్ సినిమా కాబట్టి నాకు కొంచెం టెన్షన్ గా ఉంది అంతే…

అందరి వల్ల అయ్యేది కాదు…

8 కోట్లు చిన్న బడ్జెట్ కాదు… సినిమా చాలా గ్రాండియర్ గా వచ్చింది. టెక్నీషియన్స్ వల్ల సినిమా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది…

కంటెంట్ VS ఎకానమీ

అప్పుడప్పుడు రొటీన్ సినిమా అనే కామెంట్స్ వస్తుంటాయి. కానీ సినిమా రొటీన్ అయినా ఎకనమీ వైజ్ గా చూసుకుంటా.. ఏదైనా కొత్తది ట్రై చేసినప్పుడు డెఫ్ఫినేట్ గా నేను నాతో పాటు నా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకూడదు అనుకుంటా…

 

అదే సినిమా థీమ్…

‘20 ఏళ్ల క్రితం నా తల్లి చనిపోయినప్పుడు తనని ఎలా కాపాడుకోవాలో నాకు తెలీలేదు. కానీ 20 ఏళ్ల తరవాత తన గర్ల్ ఫ్ర్రెండ్ మిస్సయితే, తనని కాపాడుకునే ప్రయత్నమే నాది..’ అని సినిమా స్టార్టవుతుంది. లవర్ టైటిల్ సినిమాకి పర్ఫెక్ట్.

 

3 సినిమాల తరవాతే హీరో…

గతంలో కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ పిల్లలని ఇంట్రడ్యూస్ చేశారు.. మనం ఇంట్రడ్యూస్ చేయగలం అంతవరకే.. జనాలెందుకు చూస్తారు..? ఏదైనా మ్యాటరుంటేనే చూస్తారు.. ఇప్పుడు ఆశిష్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ  ‘పలుకే బంగారమాయె..’ చేస్తున్నా.. సక్సెస్ అయితేనే హీరో.. లేకపోతే ప్రయత్నం చేసినట్టు.. ఎవరికైనా సినిమాల్లో ఫ్యూచర్ ఉందా లేదా అనేది జస్ట్ 3 సినిమాలతో తెలిసిపోతుంది.