రాఘవేంద్రరావు హీరోయిన్ మళ్లీ వస్తోంది..

Wednesday,July 05,2017 - 02:13 by Z_CLU

రాఘవేంద్రరావు హీరోయిన్ మళ్ళీ వస్తుందా.. ఎవరా హీరోయిన్.. ఏమా కదా..  అనుకుంటున్నారా.. అవునండి..  హీరోయిన్లను అందంగా చూపించడంలో పండిపోయిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు… ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్ గా తాప్సిని టాలీవుడ్ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ పంజాబీ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది.

టాలీవుడ్ లో ప్రభాస్, రవితేజ, గోపీచంద్, వెంకటేష్ వంటి హీరోలతో నటించిన ఈ భామ  తెలుగులో కొంత గ్యాప్ తీసుకుంది. ‘చష్మే బద్దూర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోయింది. తాజాగా అమె నటించిన నామ్ షబానా సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. అలా రెండేళ్లకు పైగా బాలీవుడ్ కే పరిమితమైపోయిన ఈ బ్యూటీ.. మళ్లీ ఇన్నాళ్లకు ఆనందోబ్రహ్మ అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది.

కామెడీ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఆనందోబ్రహ్మ సినిమా. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 18న విడుదలకానుంది. ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తోంది తాప్సి.