నితిన్ కొత్త సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్

Wednesday,July 05,2017 - 12:55 by Z_CLU

ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో లై అనే సినిమా చేస్తున్నాడు నితిన్. LIEలో L అంటే లవ్.. I అంటే ఇంటెలిజెన్స్.. E అంటే ఎనిమిటి అనే అర్థాల్ని ఇప్పటికే చెప్పేశాడు దర్శకుడు. టైటిల్ కు తగ్గట్టు ఒక్కో ఎలిమెంట్ ను రివీల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న లై సినిమాలో L-లవ్ కు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. హీరోయిన్ మేఘా ఆకాష్ తో ఉన్న రొమాంటిక్ స్టిల్స్ బయటకొచ్చాయి. ఇప్పుడు I-ఇంటెలిజెన్స్ కు సంబంధించి లుక్ విడుదల చేయబోతున్నారు.

రేపు లై సినిమాకు సంబంధించి మరో లుక్ రిలీజ్ చేస్తున్నారు. ఈ లుక్ లో ఇంటెలిజెన్స్ పేరుతో అర్జున్ గెటప్ ను చూపించబోతున్నారు. ఈ సినిమాలో అర్జున్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ లో ఇప్పటికే 150 సినిమాలు పూర్తిచేసుకున్న అర్జున్.. లై మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ క్యారెక్టర్ లుక్ ను రేపు బయటపెడుతున్నారు.

లై సినిమాకు సంబంధించి ఓవైపు లుక్స్ రిలీజ్ చేస్తూనే మరోవైపు సాంగ్స్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ ను యూట్యూబ్ లో లాంచ్ చేశారు. త్వరలోనే మరో సాంగ్ కూడా రాబోతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఆగస్ట్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు