రాశిఖన్నా ఇంటర్వ్యూ

Thursday,December 05,2019 - 03:04 by Z_CLU

‘వెంకీమామ’ లో నాగచైతన్య సరసన నటించింది రాశిఖన్నా. అయితే ఈ సినిమాలో వెంకటేష్ తో కూడా చాలా స్క్రీన్ స్పేస్ దొరికింది. దాని వల్ల ఆయన దగ్గర చాలా నేర్చేసుకున్నాను అంటుంది. దాంతో పాటు ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పుకుంది.

అదే నా లైఫ్…

వెయిట్ తగ్గడానికి చాలా కష్టపడ్డాను. పొద్దున్న లేస్తే జిమ్.. తరవాత షూటింగ్.. మళ్ళీ జిమ్.. అదే నా లైఫ్ అయిపోయింది. నటిగా నిరూపించుకోవాలంటే తప్పదు…

అలా ఉంటుంది…

కాస్త బొద్దుగా ఉంటే అవకాశాలు రావని కాదు కానీ అన్ని రకాల అవకాశాలు  రావాలంటే మాత్రం కంపల్సరీగా ఫిట్ అవ్వాలి. అది ఇండస్ట్రీ రిక్వైర్ మెంట్…

అలా జరిగింది…

ఈ సినిమాలో నా పేరు హారిక… ఒకరోజు సురేష్ బాబు గారు నా మేనేజర్ కి కాల్ చేసి, రాశి ఖన్నా అనుకుంటున్నాం అనగానే చాలా హ్యాప్పీగా అనిపించింది. ఇలాంటి అవకాశం రావాలి అని ఎప్పటి నుండో నేను వెయిటింగ్.. కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ కూడా ఆలోచించలేదు…

బయట కూడా అంతే…

చై, వెంకీ సార్ కాంబినేషన్ లో సినిమా కావాలని ఎప్పటి నుండో ఫ్యాన్స్ లో డిమాండ్ ఉంది. వాళ్ళిద్దరూ ఆఫ్  స్క్రీన్ కూడా అంతే ఎఫెక్షనేట్, జెంటిల్ గా  ఉంటారు.

నా క్యారెక్టర్ వరకు…

నా క్యారెక్టర్ ఎక్కువగా ఫస్టాఫ్ లో ఉంటుంది. సెకండాఫ్ మ్యాగ్జిమం సినిమా మామా, అల్లుళ్ళదే. ఎమోషనల్ గా ఉంటుంది సినిమా. దగ్గుబాటి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్…

చాలా నేర్చుకున్నాను…

సినిమాలో సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. నేను, వెంకీ సార్ కాంబినేషన్ లో కూడా సీన్స్ ఉంటాయి. ఆయన దగ్గర చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. మరీ ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్…

కంప్లీట్ ప్యాకేజ్…

నేను ఈ సినిమా స్టోరీ వినకముందే డెఫ్ఫినెట్ గా కథ బావుంటుందని తెలుసు. ఇకపోతే ఈ క్యారెక్టర్ నన్నే అనుకున్నారంటే తప్పకుండా క్యారెక్టర్ కి కూడా స్కోప్ ఉంటుందని గెస్ చేశా. దాంతో పాటు చై, వెంకీ సర్.. డైరెక్టర్.. టీమ్.. ప్రతీది.. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా అవకాశం పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనిపించింది. సినిమాలో నేను ఫిల్మ్ మేకర్ ని.

అదీ వెంకీ సర్…

వెంకీ సర్ కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. ఒకవేళ ఆయన లాగా చేద్దామని కాపీ చేయడానికి ట్రై చేయడానికి చేసినా వర్కవుట్ అవ్వవు. అంత యూనిక్ గా ఉంటాయి ఆయన ఎక్స్ ప్రెషన్స్…

నేనలా అనుకోను…

సినిమాలో నాతో పాటు ఇంకో హీరోయిన్ ఉంటే నాకంతగా గుర్తింపు రాదేమో అనే భయం నాకుండదు. నా వరకు వచ్చేసరికి, నేను ప్లే చేసిన క్యారెక్టర్ ఆడియెన్స్ కి గుర్తుంటుందా లేదా..? జస్ట్ అలా పాస్ అవుతుందా… లేకపోతే ఏమైనా చేయడానికి ఉందా..? అదొకటే చూసుకుంటా.. ఇకపోతే నాతో పాటు ఎంతమంది సినిమాలో ఉన్నా.. నేనసలు పట్టించుకోను… నటించడానికి స్కోప్ ఉంటే చిన్న క్యారెక్టర్ అయినా చేస్తా… డైరెక్టర్ బాబీ సినిమాలోని ప్రతి  క్యారెక్టర్ ని బ్యూటిఫుల్ గా రాశారు.

వెంకీ సర్ కి పెద్ద ఫ్యాన్ ని…

నేను వెంకీ సర్ నటించిన సినిమాలు చిన్నప్పటి నుండి చూసేదాన్ని. టి.వి. లో డబ్బింగ్ సినిమాలు వచ్చేవి. అప్పటి నుండే ఆయన సినిమాలు తెలుసు. కానీ నేను ఆయన స్టార్ గా కన్నా మంచి మనిషిగా నాకు తెలుసు. అందుకే నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని.

ప్రెజర్ ఏం లేదు…

ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నంత మాత్రాన నాకేం ప్రెజర్ లేదు. యాక్టింగ్ విషయంలో కూడా పెద్దగా డిఫెరెన్స్ అనిపించలేదు. ఒక్క ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసమే ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అది చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం కరెక్ట్ కాదు..

సింగర్ గా కరియర్…

నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. సింగర్ గా అవకాశాలు రావాలి కానీ చాలా లక్కీగా ఫీలవుతా. చిన్నప్పుడు నేను మ్యూజిక్ కూడా నేర్చుకున్నా…

అప్పుడే చేస్తా…

బాలీవుడ్ లో ఖచ్చితంగా సినిమా చేయాలని రూలేం పెట్టుకోలేదు. మంచి క్యారెక్టర్ అనిపించాలని కానీ లాంగ్వేజ్ ఏదైనా చేసేస్తా.. బాలీవుడ్ లో నాకు చేసేయాలని అనిపించే స్థాయిలో అవకాశాలు రాలేదు అందుకే చేయలేదు.

రకుల్ ప్రీత్ తో…

నేను అందరూ హీరోయిన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటాను. కాంపిటీషన్ ఉన్నా అది రిలేషన్ షిప్స్ కి అడ్డు కాదు అని నా ఫీలింగ్. ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ నా బెస్ట్ ఫ్రెండ్.

నా చేతుల్లో ఉండదు…

ఏ సినిమా చేసినా సక్సెస్ అవుతుందనే చేస్తాం… రిలీజయ్యాకే అది ఆడుతుందా..? లేదా అనేది తెలుస్తుంది. సినిమా ఎందుకు ఆడలేదు అనేది తెలియాలన్న అది రిలీజవ్వాల్సిందే. అందునా నేను హిట్స్, ఫ్లాప్స్ పెద్దగా పట్టించుకోను. అవన్నీ కరియర్ లో భాగమే. ఇకపోతే నేను చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా, అందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ ని ఇష్టపడ్డారనే అనుకుంటున్నా..

ఇండస్ట్రీ మారిపోయింది..

ఇండస్ట్రీ చాలా మారిపోయింది. అమ్మాయిలకు కూడా మంచి క్యారెక్టర్స్ రాస్తుంటారు. నటిగా సమంతా చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే ఇన్స్ పైరింగ్ అనిపిస్తుంది. గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు తను వెబ్ సిరీస్ కూడా చేయబోతుంది. ఇక్కడ అమ్మాయిలు డిసైడ్ అవ్వాలి కానీ ఎక్కడా స్టాపర్ లేదు.