పాయల్ రాజ్ పుత్ కి ఇది టెస్టింగ్ టైమ్

Thursday,December 05,2019 - 04:01 by Z_CLU

మొదట సినిమా RX 100 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా సక్సెస్ చూసి పాయల్ రాజ్ పుత్ లక్కీ.. ఒక సినిమాకే స్టార్ హీఒర్యిన్ గా రిజిస్టర్ అయిందనుకున్నారంతా. కానీ ఆ క్రేజ్ ఎన్నో రోజులు నిలవలేదు. ఆ తరవాత పాయల్ ఏ సినిమా చేసినా డిజప్పాయింట్ మెంట్ తోనే ముగిసింది. అందుకే ఆశలన్నీ ‘వెంకీమామ’ పై పెట్టుకుందీ పంజాబీ బ్యూటీ.

ఈ రోజు పాయల్ రాజ్ పుత్ బర్త్ డే సందర్భంగా ‘వెంకీమామ’  సినిమా నుండి  కలర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. వెంకటేష్ సరసన కనిపించనుంది పాయల్ ఈ సినిమాలో. ఇప్పటి వరకు గ్లామర్ డోస్ తో ఫ్యాన్స్ మెస్మరైజ్ చేసిన పాయల్ రాజ్ పుత్, ఈ సినిమాలో ఎమోషనల్ గా ఆకట్టుకోనుంది.

ఈ సినిమాతో పాటు మరోవైపు రవితేజ ‘డిస్కోరాజా’ కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్ కూడా పాయల్ పర్ఫామెన్స్ స్థాయిని ఎలివేట్ చేయబోతున్నట్టే అనిపిస్తుంది. చేతిలో గన్.. ఆ ఇంటెన్స్ లుక్స్ చూస్తుటే పాయల్ రెగ్యులర్ గా చేసే జస్ట్ గ్లామర్ రోల్ కాదనే అనిపిస్తుంది. చూడాలి మరీ… మాసివ్ సక్సెస్ ని చూసి కూడా, స్ట్రగుల్ అవుతున్న పాయల్ రాజ్ పుత్, ఇకనైన ట్రాక్ లో పడుతుందో లేదో…