రాశిఖన్నా ఇంటర్వ్యూ

Monday,August 06,2018 - 04:00 by Z_CLU

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ సినిమాలో నితిన్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా చేసే ప్రాసెస్ లో తెలుగింటి పెళ్ళి అంటే ఏంటో తెలుసుకున్నాను అని చెప్తున్న రాశిఖన్నా చాలా విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది అవి మీకోసం…

అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు…

స్టోరీ విన్నప్పుడు డెఫ్ఫినేట్ గా మంచి సినిమా చేస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ ఉంది కానీ, సినిమా చూశాక చాలా ఇమోషనల్ అయిపోయాను. సినిమా అంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ లో నితిన్, ప్రకాష్ రాజ్ గారి పర్ఫామెన్స్ సూపర్బ్ గా ఉంటుంది.

సినిమాటోగ్రఫీ గురించి…

జస్ట్ స్టోరీ మాత్రమే కాదు… సందర్భం వచ్చినప్పుడు విజువల్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. సమీర్ గారు సినిమాకి గ్రాండియర్ లుక్ ఇచ్చారు.

పెళ్ళి చేసుకోవాలని ఉంది…

నేను బేసిక్ గా నార్త్ ఇండియన్ ని కాబట్టి నాకు తెలుగు వారి ట్రెడిషన్స్ అంతగా తెలీదు. కానీ ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు, ముఖ్యంగా అమలాపురం ఎపిసోడ్స్ చేస్తున్నపుడు, ఎంతలా మెస్మరైజ్ అయిపోయానంటే… నాకూ పెళ్ళి చేసుకోవాలి అనిపించింది.

అదే సినిమా…

ఒక లవ్ స్టోరీ..  పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం.. ఆ తరవాత పెళ్ళి. పెళ్ళిలో ఉండే ట్రెడిషన్స్.. ఇమోషన్స్ ఇదే సినిమా…

సినిమాలో నా క్యారెక్టర్…

సినిమాలో నా పేరు సిరి. సితార గారు ఈ సినిమాలో నాకు మదర్ గా చేశారు. చాలా ట్రెడిషనల్ క్యారెక్టర్. పేరెంట్స్ ఇద్దరిలో మదర్ తో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాను…

వెడ్డింగ్ సెలెబ్రేషన్…

సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘శ్రీనివాస కళ్యాణం’ ఒక ప్రాపర్ వెడ్డింగ్ సెలెబ్రేషన్. బ్యూటిఫుల్ జర్నీ.

సడెన్ గా తమిళ సినిమాలు…

తమిళంలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఎలాగూ తెలుగులో మంచి సినిమాలు చేస్తున్నాను కాబట్టి, తమిళంలో కూడా ఫోకస్ చేస్తున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ 3 సినిమాలు సైన్ చేశాను. అవి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్  రిలీజ్ అవుతున్నాయి. ఆగష్టు లోనే విశాల్ కొత్త సినిమా టెంపర్ రీమేక్ సెట్స్ పైకి రానుంది.

సతీష్ వేగేశ్న గురించి…

సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ గారు ఈ సినిమాలో రిలేషన్ షిప్ గురించి ట్రెడిషన్స్ ని ఎలివేట్ చేసిన పద్ధతి సింప్లీ సూపర్బ్. అందుకే సినిమా అయిపోయాక చాలా ఇమోషనల్ గా ఫీలై ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టాను…

గుర్తుకొస్తాయి…

ఈ సినిమాకి పని చేశాక నా పెళ్ళి కూడా తెలుగు ట్రెడిషనల్ లో అయితే బావుండు అనిపించింది. నాకు ఈ సినిమాకి ముందు పంజాబీ ట్రెడిషనల్ లో పెళ్ళి అంటేనే ఇష్టం. ఇపుడా లిస్టులో తెలుగు ట్రెడిషన్ మ్యారేజ్ కూడా చేరిపోయింది…