ఒక్క ఆప్షన్ సరిపోదంటున్నారు డైరెక్టర్స్

Thursday,December 05,2019 - 09:06 by Z_CLU

సిల్వర్ స్క్రీన్ మీద ప్రూఫ్ చేసుకున్నారు… ఇక మిగిలింది డిజిటల్ ప్లాట్ ఫామ్స్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకులు వెబ్ సిరీస్ ప్రిపరేషన్స్ లో ఉన్నారు. అక్కడ కూడా తన మార్క్ క్రియేట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.

సుజీత్ : ‘సాహో’ తరవాత సుజీత్ ఏం చేయబోతున్నాడనే క్వశ్చన్ కి ఇది డిఫెరెంట్ ఆన్సర్ అయింది. ప్రభాస్ తర్వాత సుజీత్ చేయబోయే స్టార్ హీరో ఎవరా..? అని ఓ వైపు ఆలోచిస్తుంటే సుజీత్ మాత్రం వెబ్ సిరీస్ ని ఎంచుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాతే ఎవరితో సినిమా చేయాలా అనేది డిసైడ్ అవుతాడు సుజీత్.

 

సంకల్ప్ రెడ్డి : ‘ఘాజీ’, అంతరిక్షం.. ఏం చేసినా డిఫెరెంట్ గా చేశాడు సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్’ తెలుగులో ఒక స్టోరీకి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసారో కాస్త బోల్డ్ డోసేజ్ ఎక్కువగా ఉన్న కథని తెరకెక్కిస్తున్నాడు.

శరణ్ కొప్పిశెట్టి  – ‘కిర్రాక్ పార్టీ’ వెబ్ సిరీస్ చేయాలనే డెసిషన్ తీసుకున్నాడు. ‘The grill’ అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

నందిని రెడ్డి –  రీసెంట్ గా ‘ఓ బేబీ’ సినిమాతో సక్సెస్ అందుకున్న నందిని రెడ్డి ‘లస్ట్ స్టోరీస్’ లోని ఓ కథకి దర్శకత్వం వహిస్తుంది. దీని తరవాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించనుంది.

వివేక్ ఆత్రేయ – ‘మెంటల్ మదిలో’ సినిమాతో పరిచయం అయితే రీసెంట్ గా ’బ్రోచే వారెవరురా’ సినిమాతో మరింత లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఈసారి ఎలాంటి సినిమా చేస్తాడో అని వెయిట్ చేసే లోపు వెబ్ సిరీస్ ఆప్షన్ కే ఓటేశాడు. త్వరలో ఈ వెబ్ సిరీస్ డీటేల్స్ తెలియనున్నాయి.

ప్రశాంత్ వర్మ : చేసిన 2 సినిమాలు డిఫెరెంటే… ఎప్పుడూ ట్రెండ్ ని ఫాలో అవ్వలేదు. అందుకే 3 వ సినిమా కూడా ఆల్మోస్ట్ అంతే డిఫెరెంట్ గా ఉంటుందనుకున్నారంతా. కానీ ప్రశాంత్ వర్మ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయనట్టుగా వెబ్ సిరీస్ ని ఎంచుకున్నాడు.

భరత్ కమ్మ : డెబ్యూ సినిమాకే విజయ్ దేవరకొండ. ఒక్క సినిమాతోనే సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు భరత్ కమ్మ. ఇప్పుడదే మార్క్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా రిజిస్టర్ చేయబోతున్నాడు. త్వరలో వెబ్ సిరీస్ చేయబోతున్నాడు.

దర్శకుడు క్రిష్ కూడా చిన్నగా వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. కాకపోతే దర్శకత్వం కాదు. దగ్గరుండి సినిమాని నిర్మిస్తున్నాడు. తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా తన మార్క్ ని క్రియేట్ చేసుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నాడు.