వీళ్ళు చాలా బిజీ

Wednesday,September 25,2019 - 10:02 by Z_CLU

రాశి ఖన్నా.. పూజా హెగ్డే… ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్స్. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకోవడం వేరు. ఏ మాత్రం ఖాళీ లేకుండా మూడేసి సినిమాలతో ఒకేసారి సెట్స్ పై ఉండటం వేరు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ టాలీవుడ్ లో అందరికన్నా మోస్ట్ గ్రేస్ ఫుల్ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

రాశిఖన్నా ‘వెంకీమామ’ లో చైతు సరసన నటిస్తుంది. ఈ సినిమాతో పాటు సాయితేజ్ సరసన ‘ప్రతి రోజు పండగ రోజే’ లో కూడా చేస్తుంది. ఈ సినిమాలతో పాటు క్రేజీ హీరో విజయ్ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కూడా నటిస్తుంది.

 

రాశిఖన్నా తరవాత బిజీగా ఉన్న హీరోయిన్ అంటే పూజా హెగ్డేనే. రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చిన అఖిల్ సినిమా, బన్ని ‘అల వైకుంఠపురములో..’ వీటికి తోడు ప్రభాస్ ‘జాన్…’ 3 కూడా సెట్స్ పై ఉన్న సినిమాలే. మహా అయితే ఈ అమ్మడు బ్రేక్ లాంటిదేమైనా తీసుకుంటే కథలు వినడానికే తీసుకుంటుందేమో అనిపిస్తుంది. మిగతా టైమంతా సెట్స్ పైనే అన్నంత బిజీగా ఉంది పూజా హెగ్డే.

హీరోయిన్స్ సైమల్టేనియస్ గా సినిమాలు చేయడం కామనే కానీ, వీళ్ళిద్దరూ మాత్రం పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. రాశిఖన్నా ‘తొలిప్రేమ’ తో స్వింగ్ లోకి వస్తే, పూజాహెగ్డే  బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో సినిమా సినిమాకి క్రేజ్ పెంచుకునే పనిలోనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలా మూడు సినిమాలతో సెట్స్ పై ఉన్న హీరోయిన్లు వీళ్లిద్దరే.