పూరి గురి మళ్ళీ బాలయ్యపైనే...

Thursday,July 18,2019 - 11:03 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ తరవాత పూరి ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? బాలయ్యతో చేస్తాడా…? అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే నటసింహం తో ‘పైసా వసూల్’ తీసిన పూరి, ఈ ఒక్క సినిమాతో సరిపెట్టుకోవాలనే ఆలోచనలో అయితే అస్సలు లేడు…

పూరికి కథ రాసుకోవడం అసలు కష్టమే కాదు.. అంతెందుకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విషయంలో కూడా రామ్ తో డిస్కస్ చేసినప్పుడు అసలు పూరి దగ్గర కథే లేదు.. ఎలాంటి సినిమా చేయాలో ఫిక్సయ్యాకే పెన్ను పేపర్ మీద పెట్టాడు.. అంతే… సినిమా రెడీ అయింది.. రిలీజ్ కూడా అయిపోయింది.. కానీ బాలయ్య విషయంలో అలా కాదట.

‘బాలయ్య సినిమా అంటే చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. టైమ్ పడుతుంది కథ రాసుకోవాలంటే.. అందుకే ప్రస్తుతానికి ఆ ప్రిపరేషన్స్ లో ఉన్నా’ అని , రీసెంట్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్ లో చెప్పుకున్నాడు…

బాలయ్య అంటేనే మాస్ హీరో.. అలాంటిది ఆ మాస్ కి స్టైల్ జోడించి ‘పైసా వసూల్’ సినిమా చేశాడు. మరి ఈసారి బాలయ్యను ఎలా చూపించాలని ప్లాన్ చేసుకుంటున్నాడో పూరి… ఈ సినిమా మరి ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో.. చూడాలి.