ఎన్టీఆర్ కోసం క్యూలో ఆ ముగ్గురు...

Wednesday,September 14,2016 - 03:34 by Z_CLU

జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ స్టార్ డమ్ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు తారక్. సినిమా రిలీజైన వెంటనే మరో ప్రాజెక్టు ఎనౌన్స్ చేసే తారక్, ఈసారి రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోవడంతో… నెక్ట్స్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టే గాసిప్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం… తారక్ కు ముగ్గురు ప్రముఖు దర్శకులు కథలు వినిపించారట.

ఎన్టీఆర్ తో ఎన్నాళ్ల నుంచో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్న తమిళ దర్శకుడు లింగుస్వామి ఇప్పటికే ఓ కథ వినిపించాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సన్నిహితులు కన్ ఫర్మ్ చేశారు. అయితే లింగుస్వామితో పాటు అనిల్ రావిపూడి కూడా ఓ స్టోరీలైన్ వినిపించాడట. పటాస్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనీల్ రావిపూడి, కల్యాణ్ రామ్ రిఫరెన్స్ తో తారక్ కు కథ వినిపించాడట. ఈ ఇద్దరు దర్శకులతో పాటు తారక్ కు టెంపర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాధ్ కూడా లిస్ట్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఎవరికి తారక్ ఛాన్స్ ఇస్తాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.