ఇప్పుడు టైమ్ వీళ్ళదే...

Thursday,July 18,2019 - 12:03 by Z_CLU

ఒకప్పుడు తెలుగు సినిమాలో మలయాళీ హీరోయిన్స్ కి భారీ క్రేజ్ ఉండేది… తెలుగు ఆడియెన్స్ కి ఫస్ట్ సినిమాతోనే కనెక్ట్ అయిపోయేవారు ఈ భామలు… అయితే ఇప్పుడు ఆ క్రేజ్ చిన్నగా స్టేట్ మారింది… ఇప్పుడు టైమ్ కన్నడ భామలదే…

రష్మిక మండన్న : ప్రస్తుతం వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్.. అనుమానమే లేదు. ‘ఛలో’ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమైంది. చూస్తుండగానే రేంజ్ బన్ని, మహేష్ బాబు హీరోయిన్ అనిపించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్మిక డేట్స్ దొరకాలంటే కష్టం అనిపించేంత బిజీ అయిపొయిందీ కన్నడ భామ.

నభా నతేష్ : ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో కొత్త అమ్మాయి అయినా ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేసింది అనిపించుకుంది. కట్ చేస్తే.. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ లో చాన్స్ కొట్టేసింది. రవితేజ ‘డిస్కోరాజా’ లో కూడా నటిస్తుంది. ఈ 2 సినిమాల తరవాత డెఫ్ఫినెట్ గా నభా రేంజ్ మారిపోనుంది.

శ్రద్ధా శ్రీనాథ్ : ‘జెర్సీ’ తో తెలుగు సినిమాకి పరిచయమైంది. లక్కీగా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరకడంతో, మొదటి సినిమాకే ఆల్మోస్ట్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయిపోయింది శ్రద్ధా.  

ఈ వరసలో మరింత మంది కన్నడ హీరోయిన్స్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు… చూడాలి ఈ వరసలో ముందుగా చేరబోయే సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరో..?..