అంతా ‘పూరి’ ఇష్టం.. ఇకపై అన్నీ సొంతంగానే...

Thursday,March 14,2019 - 11:03 by Z_CLU

పూరి జగన్నాథ్ అంటేనే ఓ యూనిక్ స్టైల్. ఒకర్ని స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వనివ్వడు.. కాస్టింగ్ విషయంలో కాంప్రమైజ్ కాడు… చివరికి సినిమా రిలీజయ్యాక సక్సెసా..? కాదా… అని కూడా పెద్దగా పట్టించుకోడు.. తరవాత ఏం చేయాలా అనే యాంగిల్ లో స్టార్ట్ అయిపోతాడు. ఇంత డైనమిక్ గా ఉంటాడు కాబట్టే పూరి జగన్నాథ్ కి, ఓ సెట్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ సినిమా చేసినా పూరి టార్గెట్ కూడా స్ట్రేట్ గా ఫ్యాన్సే…  అందుకే ఈ మధ్య అన్నీ సొంతంగా చేసుకోవడమే బెటరని ఫిక్సయినట్టున్నాడు…

రీసెంట్ గా పూరి ఆకాష్ తో ‘మెహబూబా’ సినిమా చేశాడు పూరి. పర్ఫామెన్స్ విషయంలో క్వశ్చన్స్ వేయడానికి లేదు కానీ, పూరి ఆకాష్ మార్కెట్ కన్నా, రెండింతలు బడ్జెట్ పెట్టేశాడు. సినిమా చూశాక విజువల్స్ గురించి డిస్కస్ చేయని వాళ్ళు లేరు.  ఏదో కొడుకు కదా అని ఆ రేంజ్ లో పెట్టేశాడు అనుకోవడానికి కూడా లేదు. పూరి గతంలోనూ సినిమాలు సొంతంగా నిర్మించి ఉన్నాడు… వాటితో కంపేర్ చేస్తే, స్క్రిప్ట్ ని బడ్జెట్ డామినేట్ చేసే దాఖలాలు ఎక్కడా కనిపించవు.

 

ఈ సినిమా ప్రమోషన్ టైమ్ లో మళ్ళీ ఆకాష్ తో సినిమా ఉంటుందని చెప్పినా, ఈ గ్యాప్ లో రామ్ తో మరో సైన్స్ ఫిక్షన్ ని ప్లాన్ చేసేశాడు, సెట్స్ పైకి కూడా తెచ్చేశాడు. ఇది కూడా సొంత నిర్మాణంలోనే. ఈ సినిమా కోసం కూడా రామ్ మార్కెట్, సక్సెస్ రేట్ వగైరా వగైరాల్లాంటి లాజిక్స్ లేకుండా గ్రాండ్ స్కేల్ పై సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

 

దీన్ని బట్టి పూరి ఫ్యూచర్ లో కూడా సొంత నిర్మాణంలోనే సినిమాలు ప్రిఫర్ చేస్తాడనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎవరైనా నోటెడ్ ప్రొడ్యూసర్స్ పని పడగా, పూరిని అప్రోచ్ అయితే చెప్పలేం కానీ, ఈ మాసివ్ డైరెక్టర్ మాత్రం సొంతంగా సినిమాలు చేసుకోవడమే బెటరనే ఫీలింగ్ లో ఉన్నాడు.