మహేష్ తో పూరి సినిమా ఎప్పుడో?

Wednesday,July 20,2016 - 12:03 by Z_CLU

 

నెలల్లో సినిమాలు పూర్తి చేసేసి వరుస ప్రాజెక్ట్స్ తో ఎప్పుడూ బిజీ గా ఉండే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరా? అంటే పూరి అనే చెప్పొచ్చు. తన గురువు రాంగోపాల్ వర్మ దగ్గర నుండి తొందరగా సినిమా పూర్తి చేసే టెక్నిక్స్ నేర్చుకొని ఆ దిశగా చిత్రీకరణ లో జోరు మీదుండే పూరి ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ‘ఇజం’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. మొన్నటి వరకూ ‘రోగ్’ సినిమాను పూర్తి చేసి వెంటనే కళ్యాణ్ రామ్ తో సినిమాను సెట్స్ పై పెట్టిన పూరి ఇంకో రెండు నెలల్లో కాళీ అయిపోతాడు. ఇక ఏ సినిమా తరువాత ఈ టాప్ఎ డైరెక్టర్ ఎవరితో? చేస్తాడా? అని అందరిలో సందేహం నెలకుంది. ఇటీవలే మహేష్ తో మూడో సారి అంటూ ‘జనగణమన’ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసేసిన పూరి తో మహేష్ ఇప్పుడే సినిమా చేసే పరిస్థితి లేదనే వార్త వినిపిస్తుంది. ఇందుకు కారణం మహేష్ ప్రస్తుతం మురుగదాస్ తో ఓ సినిమా చేస్తుండడం ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాపోవడం ఈ సినిమా తరువాత మరో సారి కొరటాల తో పాటు వంశీ పైడి పల్లి తోనూ ఓ సినిమా చెయ్యాలనుకుంటుండం తో పూరి ఈ లోపు ఏ హీరో తో సినిమా చేస్తాడో? అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు సినీ జనం. ఏదేమైనా మహేష్ ఒక్క సినిమా చేసే లోపు పూరి ఓ రెండు సినిమాలు చెయ్యడం గ్యారెంటీ. మరి ఈ లోపు పూరి ఏ హీరో తో చేస్తాడో? చూడాలి.