యంగ్ హీరోలు - పాత గెటప్స్

Thursday,July 18,2019 - 10:02 by Z_CLU

‘రణరంగం’ సినిమాలో శర్వానంద్ వింటేజ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా నుండి రిలీజైన స్టిల్స్ లో శర్వా మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. రెగ్యులర్ గా సినిమా న్యూ లుక్స్ లో కనిపిస్తూ మెస్మరైజ్ చేసే హీరోలు, సడెన్ గా వెనక్కి వెళ్లి.. వింటేజ్ గెటప్స్ వేసేసరికి మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు. శర్వా ఒక్కడే కాదు… రీసెంట్ గా మరి కొంతమంది హీరోలు ఇలాంటి గెటప్స్ లో కనిపించి మెస్మరైజ్ చేశారు…

ఆనంద్ దేవరకొండ : డెబ్యూ సినిమాకే ఇలాంటి రోల్ దొరకడం ఆనంద్ దేవరకొండకి కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ యంగ్ హీరో స్టైలిష్ లుక్స్ లో ఎలా ఉంటాడన్నది ఫ్యూచర్ సినిమాల్లో తెలుస్తుంది కానీ, ‘దొరసాని’ సినిమాలో  వింటేజ్ గెటప్ లో మాత్రం అందరికీ నచ్చేశాడు.

రామ్ చరణ్ – చెర్రీ ఎన్ని సినిమాలు చేసినా ‘రంగస్థలం’ ఎప్పటికీ స్పెషలే… అందునా 1980 బ్యాక్ డ్రాప్ లో.. రామ్ చరణ్ లుక్స్… స్టైలింగ్… ఆడియెన్స్ మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి.

నాని : ‘జెర్సీ’ లో కనిపించాడు 1980 బ్యాక్ డ్రాప్ లో… సిల్వర్ స్క్రీన్ పై టైమ్ ని వెనక్కి తీసుకెళ్ళి ప్రెజెంట్ చేసినా, ఆ జోన్ లో కూడా న్యాచురల్ పర్ఫామర్ అనిపించుకున్నాడు నాని.అప్పటి క్రికెటర్ లా నచ్చేశాడు.

విజయ్ దేవరకొండ : ‘మహానటి’ లో విజయ్ దేవరకొండ వింటేజ్ గెటప్ లో కనిపించాడు. ఈ క్యారెక్టర్ లో తను రెగ్యులర్ గా కనిపించే అగ్రెసివ్ షేడ్స్ లేకపోయినా… ఈ సినిమాతో 1980 జెనెరేషన్ ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యాడు.