పూరి కూడా సస్పెన్స్ అంటున్నాడు..

Saturday,December 03,2016 - 10:32 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే టాప్ డైరెక్టర్ ఎవరా? అనే టక్కున వినిపించే పేరు పూరి జగన్నాథ్. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యే పూరి  ఉన్నట్టుండి తన స్పీడ్ తగ్గించాడా? అంటే అవుననే చెప్పాలి.

లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఇజం’ సినిమాను తెరకెక్కించిన పూరి ఈ సినిమా రిలీజ్ అయి చాలా రోజులే కావొస్తున్నా తన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ మాత్రం చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మొన్నటివరకూ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడనే టాక్ వినిపించినా ఎన్టీఆర్ లేటెస్ట్ గా మరో డైరెక్టర్ కి ఫిక్స్ అయ్యాడని, పూరి తో సినిమా ఇక ఉండదనే వార్త కూడా వినిపిస్తుంది.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా తన నెక్స్ట్ సినిమా పై ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెడితే పూరి కూడా అదే సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. తన కొత్త సినిమా  రోగ్… థియేటర్లలోకి వచ్చిన తర్వాత పూరి తన నెక్ట్స్ సినిమా డీటెయిల్స్ వెల్లడించే అవకాశముంది.