ఎట్టకేలకు బాలకృష్ణతో మూవీ

Sunday,February 26,2017 - 09:14 by Z_CLU

దాదాపు కొన్ని నెలల నుంచీ నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ హఠాత్తుగా ఒకే ఒక్క అనౌన్స్ మెంట్ తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు పూరి. ‘ఇజం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పూరి లేటెస్ట్ గా బాలయ్య 101 సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్.

నిజానికి పూరి ఎప్పటి నుంచో చిరుతో ఓ సినిమా, బాలయ్య తో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. ఇటీవలే చిరు కి కూడా ఓ కథ వినిపించిన పూరి ఆ సినిమా సెట్ కాకపోవడం తో వెంటనే బాలయ్య పై ఫోకస్ పెట్టి ఓ కథ వినిపించి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.. మరి ఈ సినిమాతో బాలయ్య ను పూరి ఎలా చూపించబోతున్నాడు.. అసలింతకీ బాలయ్య ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రీజన్ ఏంటి.. అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే…