జీ సినిమాలు ( ఫిబ్రవరి 26th)

Saturday,February 25,2017 - 10:00 by Z_CLU

 

నటీనటులు : శ్రీహరి, వేణుమాధవ్, ప్రియా మోహన్

ఇతర నటీనటులు : రుతిక, ఆలీ, నాగబాబు, తదితరులు..

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : విక్రమ్ గాంధీ

ప్రొడ్యూసర్ : వేణు మాధవ్

రిలీజ్ డేట్ : 14 మార్చి 2008

వేణుమాధవ్, ప్రియా మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమాభిషేకం. విక్రం గాంధీ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. శ్రీహరి పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

============================================================================

 నటీ నటులు : సిద్ధార్థ, హన్సిక మోత్వాని

ఇతర తారాగణం : బ్రహ్మానందం, గణేష్ వెంకట్ రామన్, సమంతా, రాణా

సంగీతం : సత్య

డైరెక్టర్ : C. సుందర్

నిర్మాత : B.సుబ్రహ్మణ్యం, సురేష్

ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్స్ తో తెరపైకి వచ్చే సిద్ధార్థ్ కరియర్ లో సక్సెస్ ఫుల్ గా నిలిచిన సినిమా “సమ్ థింగ్ సమ్ థింగ్” తన ప్రేమను దక్కించుకోవడం కోసం లవ్ గురు ను సంప్రదించిన కుర్రాడి జీవితంలో జరిగిన మార్పులు ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. లవ్ గురు పాత్రలో బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్. దానికి తోడు గెస్ట్ అప్పియరెన్స్ తో సర్ ప్రైజ్ చేసే సమంతా, రాణా సినిమాకి మరో ఎసెట్. ఈ సినిమాతో హన్సిక సిద్ధార్థ కి పర్ ఫెక్ట్ ఆన్ స్క్రీన్ జోడి అనిపించుకుంది.

=============================================================================

హీరోహీరోయిన్లు  – నితిన్, మమతా మోహన్ దాస్

నటీనటులు – సింధు తులాని, అశుతోష్ రానా, శశాంక్, దువ్వాసి మోహన్, బ్రహ్మానందం,అలీ

సంగీతం – చక్రి

బ్యానర్ – ఆర్.ఆర్. మూవీ మేకర్స్

దర్శకత్వం – రవి. సి. కుమార్

విడుదల – 2008, జూన్ 27

ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నితిన్ నటించిన సినిమా విక్టరీ. 2008లో నితిన్ మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి విక్టరీ. అశుతోష్ రానా విలన్ గా నటించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ ఎప్పీయరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ తెలివైన కుర్రాడు తన బలంతో పాటు తెలివితేటలతో ల్యాండ్ మాఫియాను ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ.

==============================================================================

నటీనటులు : గోపీచంద్, మీరా జాస్మిన్

ఇతర నటీనటులు : అంకిత, శివాజీ, ఆశిష్ విద్యార్థి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : GVG రాజు

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది రారాజు. అతి సున్నితమైన లవ్ స్టోరి కి  మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కలెక్టర్ కావాలని కలలు కనే ఆంబీషియస్ అమ్మాయిగా మీరా జాస్మిన్ సరికొత్తగా కనిపిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ సినిమాకి హైలెట్.

=============================================================================

నటీ నటులు : చిన్నా, మయూరి,

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

============================================================================

నటీ నటులు : అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ
ఇతర నటీనటులు : S.V.రంగా రావు, చిత్తూర్ వి. నాగయ్య, గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్
డైరెక్టర్ : ఆదుర్తి సుబ్బారావు
ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు
రిలీజ్ డేట్ : 1972

ఒకే కాలేజీలో చదువుకుంటున్న మాధవ్ సంధ్య ల అనుబంధం, చెడు అనుభవాలతో మొదలవుతుంది. ఒకానొక పరిస్థితుల్లో మాధవ్ తనకు జరిగిన అన్యాయానికి సంధ్యను అత్యాచారం చేసి ఆ తరవాత ఫారిన్ కి వెళ్ళిపోతాడు. కానీ సంధ్య జీవితం పూర్తిగా చీకటై పోతుంది. తన అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. సంధ్య ఒక బిడ్డకు తల్లి ఆ బిడ్డను అనాథాశ్రమంలో వదిలేస్తుంది. కొన్నాళ్ళకు ఫారిన్ నుండి తిరిగి వచ్చిన మాధవ్, తన కన్నబిడ్డ అనాధాశ్రమంలో పెరుగుతున్నాడని తెలిసి ఏం చేస్తాడు..? చెదిరిపోయిన సంధ్య జీవితాన్ని ఎలా సరిదిద్దుతాడు..? అన్నదే కథాంశం.

=============================================================================

నటీనటులు : వేణుమాధవ్, కృష్ణ భగవాన్, అమృత, సైరాబాను, మధుమిత, ప్రేమ, పూర్ణిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కానూరి

డైరెక్టర్ : అరుణా కాంత్

ప్రొడ్యూసర్ : G. అరుణా కుమారి, అరుణా కాంత్

వేణు మాధవ్, కృష్ణ మాధవ్ నటించిన డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ టి టిక్ టిక్. అరుణా కాంత్ డైరెక్షన్  లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్టయింది.