ఆ పనిలో పడ్డ టాప్ డైరెక్టర్స్ ....

Sunday,February 26,2017 - 10:09 by Z_CLU

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందరూ నెక్స్ట్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ బిజీలో ఉంటే ఓ ముగ్గురు డైరెక్టర్స్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయ్యారు. వివరాల్లోకెళితే ప్రెజెంట్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ గా వెలుగుతున్న వినాయక్, త్రివిక్రమ్, కొరటాల శివ తమ నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నిమగ్నమై పోయారు.

‘ఆ ఆ’ సినిమా తర్వాత మరోసారి పవన్ తో సినిమాను ప్లాన్ చేసుకొని లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజి లో ఉండటంతో… హీరోయిన్ ను టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసి ప్రెజెంట్ లొకేషన్స్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటూ బిజీ గా గడుపుతున్నాడు త్రివిక్రమ్…

‘ఖైదీ నంబర్ 150’ సక్సెస్ తో జోరు మీదున్న వినాయక్ తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు. ఈ సినిమాను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కిస్తాడనే వార్త చక్కర్లు కొడుతున్నా ఈ విషయాన్నీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ అయిపోయాడు..

ఇక ‘జనతా గ్యారేజ్’ వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత మరో సారి మహేష్ తో సినిమాను చేయడానికి రెడీ అవుతున్న కొరటాల శివ కూడా ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చే పనిలో పడ్డాడు. ప్రెజెంట్ మురుగదాస్ సినిమాతో బిజీ గా ఉన్న మహేష్ కోసం ఎదురుచూస్తూ మరో పక్క ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెస్తున్నాడు కొరటాల…
ఇలా టాప్ డైరెక్టర్స్ లో ఈ ముగ్గురు తమ నెక్స్ట్ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే మమేకమై త్వరలోనే స్టార్స్ తో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు…