#Prabhas20 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,July 08,2020 - 11:55 by Z_CLU

రెబల్ స్టార్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 10వ తేదీ ఉదయం 10 గంటలకు #Prabhas20FirstLook రిలీజ్ కాబోతోంది.

రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు అదే టైమ్ కు టైటిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ మూవీకి జాన్ లేదా రాథేశ్యామ్ అనే టైటిల్స్ లో ఒకటి ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఫ్యాన్స్ అయితే ఇప్పటికే రాథేశ్యామ్ అనే టైటిల్ తో ట్రెండింగ్స్ షురూ చేశారు. సో.. మేకర్స్ కూడా అదే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.