మరో నెల రోజుల్లో పెళ్లి.. భారీ ఏర్పాట్లు

Wednesday,July 08,2020 - 11:02 by Z_CLU

ఇవాళ్టికి సరిగ్గా మరో నెల రోజుల్లో రానా పెళ్లి జరగబోతోంది. ఆగస్ట్ 8న ఈ హీరో, తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ప్రస్తుతం 2 కుటుంబాలు షాపింగ్స్ తో బిజీగా ఉన్నాయి.

పెళ్లికి అవసరమైన దుస్తులు, నగలు కొనే పనిలో రెండు కుటుంబాలు బిజీగా గడుపుతున్నాయి. మరోవైపు మిహీకా తను చేస్తున్న షాపింగ్ ఫొటోలు, అందుకుంటున్న బహుమతులు, వేసుకుంటున్న డిజైనరీ దుస్తుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతోంది.

హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో రానా-మిహికా పెళ్లి జరగనుంది. ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టు తక్కువ మంది అతిథులతోనే ఈ పెళ్లి జరగబోతోంది.

లిమిటెడ్ గా పెళ్లి కార్డులు కొట్టించడంతో పాటు సురేష్ బాబు పర్సనల్ గా అందరికీ ఫోన్లు చేసి తనయుడి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.